Delhi Capitals Head Coach :ఐపీఎల్ 2025 కోసం దిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ కీలక నిర్ణయం తీసుకుంది. టీమ్ఇండియా మాజీ క్రికెటర్ హేమంగ్ బదానీని తమ జట్టు హెడ్ కోచ్‌గా నియమించింది. ఇకపై మాజీ కోచ్ రికీ పాంటింగ్ స్థానాన్ని మాజీ హేమంగ్ రిప్లేస్ చేయనున్నాడు. అటు ఐపీఎల్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా వేణుగోపాల్ రావును ఎంపిక చేసుకుంది. ఈ బాధ్యతలో గతంలో సౌరభ్ గంగూలీ కొనసాగాడు. ఈ ఇద్దరి నియామకాన్ని దిల్లీ క్యాపిటల్స్ జట్టు సోషల్ మీడియాలో అఫీషియల్‌గా ప్రకటించింది.
దిల్లీకి నయా హెడ్ కోచ్- పాంటింగ్‌ను రిప్లేస్ చేసేది ఎవరంటే? - DELHI CAPITALS HEAD COACH
Delhi Capitals Head Coach : ఐపీఎల్ 2025 కోసం దిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ జట్టులో కీలక మార్పులు చేసింది.
Delhi Capitals Head Coach (Source: Getty Images)
Published : Oct 17, 2024, 4:06 PM IST
'హేమంగ్ బదానీ, వేణు గోపాల్ రావును దిల్లీ ఫ్రాంచైజీలోకి ఆనందంగా ఆహ్వానిస్తున్నాం' అని పోస్ట్ చేసింది. కాగా, హేమంగ్ టీమ్ఇండియా తరఫున నాలుగు టెస్టులు, 40 వన్డేల్లో ప్రాతినిధ్యం వహించాడు. అలాగే డొమెస్టిక్ క్రికెట్లో తమిళనాడు జట్టుకు కెప్టెన్‌గానూ వ్యవహరించాడు.