తెలంగాణ

telangana

ETV Bharat / sports

'అప్పుడు ద్వేషించా, ఇప్పుడు స్టిక్​పై ఆమె పేరు'- శ్రీజేశ్ క్యూట్ లవ్ స్టోరీ రివీల్! - Pr Sreejesh Love Story - PR SREEJESH LOVE STORY

PR Sreejesh Love Story: ఒలింపిక్స్‌లో అద్భుత ప్రదర్శన తర్వాత గోల్‌ కీపర్‌ శ్రీజేశ్‌ హాకీకి గుడ్​బై చెప్పేశాడు. అయితే తాజాగా ఈ లెజెండరీ ప్లేయర్‌ తన క్యూట్‌ లవ్‌ స్టోరీని షేర్‌ చేసుకున్నాడు. ద్వేషించిన వ్యక్తినే పెళ్లాడాడు.

Sreejesh Love Story
Sreejesh Love Story (Source: Associated Press)

By ETV Bharat Sports Team

Published : Aug 15, 2024, 9:19 AM IST

PR Sreejesh Love Story:2024 పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు కాంస్యం సాధించడంలో గోల్‌ కీపర్ పీఆర్‌ శ్రీజేశ్‌ది కీలక పాత్రని చెప్పవచ్చు. బలమైన బ్రిటన్‌ని క్వార్టర్‌ ఫైనల్లో ఓడించి ఇండియా సెమీస్ చేరుకుందంటే అందుకు శ్రీజేశ్‌ కారణం. షూటౌట్‌కి వెళ్లిన మ్యాచ్‌లో భారత్‌ని 4-2తో గెలిపించాడు. అడ్డుగోడలా నిలిచి ప్రత్యర్థులు గోల్‌ చేయకుండా ఆపాడు. ఒలింపిక్స్‌లో భారత్‌ కాంస్యాన్ని అందుకున్న తర్వాత తన కెరీర్‌కు ఈ సీనియర్‌ గోల్‌ కీపర్‌ రిటైర్‌మెంట్‌ ప్రకటించేశాడు.

ప్రొఫెషనల్‌ కెరీర్‌లో గోల్‌ పడకుండా అడ్డుకునే శ్రీజేశ్‌, నిజ జీవితంలో మాత్రం ప్రేమలో పడిపోయాడు. ఇటీవల ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భార్య అనీశ్యతో కలిసి తన అందమైన ప్రేమ కథను బయటపెట్టాడు. ద్వేషించిన వ్యక్తినే పెళ్లాడానని, లవ్‌ స్టోరీ చాలా సినిమాటిక్‌గా ఉంటుందని తెలిపాడు. శ్రీజేశ్ లవ్‌ స్టోరీ మనమూ తెలుసుకుందాం పదండి.

ఓపెన్‌ చేస్తే!
'2001లో కేరళ కన్నూర్‌లోని స్పోర్ట్‌ స్కూల్‌లో చదువుతున్నప్పుడు అనీశ్య కూడా అక్కడే చేరింది. అనీశ్య జాయిన్‌ కాక ముందు నేను బెస్ట్ స్టూడెంట్‌. క్లాస్‌లో టాపర్‌, సూపర్‌ స్టార్‌. టీచర్లు అందరికీ నేనే ఫేవరెట్‌ స్టూడెంట్‌. ఎప్పుడైతే ఆమె వచ్చిందో పరిస్థితులు అన్నీ మారిపోయాయి. నాకున్న క్రేజ్‌ అంతా పోయింది. అప్పటివరకు నేను 50కి 35- 42 మార్కులు సాధించేవాడిని. ఆమె మాత్రం 50కి 49 మార్కులు తెచ్చుకుని అందరికీ ఫేవరెట్‌ అయిపోయింది. దీంతో నేను ఆమెను ద్వేషించడం మొదలుపెట్టాను. క్రమంగా ఇద్దరం శత్రువులు అయిపోయాం. కానీ, ఎలా జరిగిందో తెలియదు కొన్నాళ్లకు మేమిద్దరం ప్రేమలో పడిపోయాం' అని శ్రీజేశ్‌ చిన్ననాటి సంగతులు గుర్తుచేసుకున్నాడు.

కట్‌ చేస్తే వివాహం
కొన్నేళ్ల పాటు శ్రీజేశ్‌ అనీశ్య రిలేషన్‌లో ఉన్నారు. 2013లో రెండు కుటుంబాల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. వృత్తిరీత్యా అనీశ్య ఆయుర్వేద డాక్టర్‌. అయినప్పటికీ ఆమె హాకీ విషయంలో తనకు ఎంతో అండగా నిలుస్తుందని శ్రీజేశ్ చెబుతుంటాడు. భార్య మీద ప్రేమతో తన హకీ స్టిక్‌పై ఆమె పేరును ప్రత్యేకంగా వేయించుకున్నాడు. ఈ దంపతులకు కుమారుడు శ్రీఅన్ష్‌, కుమార్తె అనుశ్రీ ఉన్నారు. వీరిద్దరి పేర్లను కూడా హకీ స్టిక్‌లపై రాయించుకున్నాడు. పారిస్‌ ఒలింపిక్స్‌లో కూడా శ్రీజేశ్ ఇవే స్టిక్‌లతో బరిలో దిగాడు.

పిల్లలను బలవంతం చేయను
శ్రీజేశ్‌ పిల్లల గురించి కూడా మాట్లాడాడు. 'నా కుమార్తె తనకు ఈత కొట్టడం ఇష్టమని చెప్పింది. అందుకే నేను స్విమ్మింగ్‌లో జాయిన్‌ చేశాను. పీవీ సింధును చూసిన తర్వాత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి కావాలని కోరుకుంది. బ్యాడ్మింటన్ కూడా నేర్చుకోమని చెప్పాను. నా కొడుకు విరాట్ కోహ్లీ కావాలని అనుకున్నాడు. కానీ ఇప్పుడు అస్సలు వర్కవుట్ చేయడం లేదు. వాళ్లు ఏది కావాలనుకున్నా సంతోషమే. వాళ్లపై నేను భారం మోపాలని అనుకోవడం లేదు. భారతదేశంలో పిల్లల్ని తల్లిదండ్రులతో పోలుస్తుంటారు. నేను అలా చేయకూడదు అనుకుంటున్నా' అని చెప్పాడు.

శ్రీజేశ్​కు అరుదైన గౌరవం- జెర్సీ నెం.16ని రిటైర్ చేసిన హాకీ ఇండియా - P R Sreejesh Jersey

'హాకీ కోచ్ నా టార్గెట్- దానికి స్ఫూర్తి రాహుల్ ద్రవిడే ' - PR Sreejesh Hockey

ABOUT THE AUTHOR

...view details