Harshit Rana Border Gavaskar Trophy : బోర్డర్-గావస్కర్ ట్రోఫీతో టెస్టుల్లో అరంగేట్రం చేసిన యంగ్ బౌలర్ హర్షిత్ రాణా తొలి మ్యాచ్‌లో ఆకట్టుకున్నప్పటికీ రెండో టెస్టులో మాత్రం కాస్త ఇబ్బంది పడ్డాడు. అయితే మూడో మ్యాచ్ నుంచి రెడ్ బాల్ టెస్టులోకి ఆట మారనున్న నేపథ్యంలో అతడ్ని తుది జట్టులో కొనసాగిస్తారా? లేదా? అన్న సంగిద్ధత నెలకొంది. ఈ నేపథ్యంలో హర్షిత్‌కు అతడి తండ్రి ప్రదీప్ రాణా చేసిన ఓ సవాల్ వైరల్‌గా మారాయి. బంతి స్పీడ్ విషయంలో తాను హర్షిత్‌కు ఓ సవాలు విసిరినట్లు అతడి తండ్రి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
"150 కిమీ వేగంతో బాల్స్ వేయాలని హర్షిత్‌కు నేను ఛాలెంజ్ చేశాను. ఆ వేగాన్ని అందుకున్న రోజే తనను ఒక ప్లేయర్‌గా పరిగణిస్తానని చెప్పాను. అయితే అంత వేగంతో బంతులేస్తే టీమ్‌ఇండియాకు ఆడకుండా నిన్ను ఎవరూ ఆపలేరనీ కూడా తనకు చెప్పాను. ఒకవేళ 125 కి.మీ స్పీడ్‌తో బంతులేస్తే మాత్రం లోకల్ క్లబ్‌ల్లో ఆడేందుకు కూడా నిన్ను తీసుకోరు అని అన్నాను" అని హర్షిత్ తండ్రి వెల్లడించాడు.