తెలంగాణ

telangana

ETV Bharat / sports

నటాషాతో విడాకులు - ఆ కోచ్​తో హార్దిక్​ ఇంట్రెస్టింగ్ కన్వర్జేషన్​! - Hardik Pandya Divorce - HARDIK PANDYA DIVORCE

Hardik Pandya Divorce : హార్దిక్ తన భార్య నటాషాతో విడిపోయాడంటూ ఆ మధ్య జోరుగా వార్తలు వచ్చాయి. అనంతరం కొద్ది రోజులుగా మళ్లీ కలిసిపోయారంటూ ప్రచారం సాగుతోంది. ఇంతకీ ఈ విషయమై హార్దిక్​ ఏమన్నాడంటే?

Source ANI
hardik natasa (Source ANI)

By ETV Bharat Telugu Team

Published : Jun 13, 2024, 7:22 PM IST

Hardik Pandya Divorce :టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో హార్దిక్‌ పాండ్యా తన పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకుంటున్నాడు. ఐపీఎల్‌ 2024, అనంతరం నెలకొన్న పరిస్థితుల నుంచి నెమ్మదిగా బయటపడుతున్నాడు. ముంబయి ఇండియన్స్‌ కెప్టెన్సీ వివాదం, ఆల్‌రౌండర్‌గా, కెప్టెన్‌గా రాణించకపోవడం వంటి కారణాలతో ముంబయి ఇండియన్స్‌, రోహిత్‌ శర్మ ఫ్యాన్స్‌ నుంచి హార్దిక్‌ తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నాడు. ఐపీఎల్‌ నుంచి మొట్ట మొదట ఎంఐ ఎలిమినేట్‌ కావడం కూడా హార్దిక్‌పై తీవ్ర ప్రభావం చూపింది.

అంతే కాకుండా, అతని భార్య నటాషా స్టాంకోవిక్‌తో పాండ్యా విడిపోయాడనే పుకార్లు తెగ వైరల్‌ అయ్యాయి. నటాసా తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ నుంచి పాండ్యా పేరును తొలిగించి, హార్దిక్‌తో తన పెళ్లి ఫోటోలను డిలీట్​ చేయడంతో ఇదంతా ప్రారంభమైంది. హార్దిక్ ఆస్తుల్లో ఆమె 70 శాతం భరణంగా పొందుతుందనే వార్తలు వచ్చాయి. కానీ ఆ తర్వాత మళ్లీ ఏమైందో గానీ ఇద్దరు కలిసి పోయారనే ప్రచారం సాగింది. నటాషా కూడా తన ఇన్​స్టా అకౌంట్​లో హార్దిక్​ ఫొటోలను మళ్లీ పోస్ట్ చేసింది. అయితే తాజాగా ఎట్టకేలకు తన డివొర్స్​పై వచ్చిన విమర్శలు, రూమర్లకు పాండ్యా పరోక్షంగా ఫుల్‌ స్టాప్‌ పెట్టాడు.

  • రికీ, పాండ్యా ఆసక్తికర కన్వర్జేషన్‌

టీ20 వరల్డ్‌ ప్‌లో పాకిస్థాన్‌, భారత్ మ్యాచ్‌కు ముందు హార్దిక్​తో పాటు కొంతమంది భారత ఆటగాళ్లను ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌, దిల్లీ క్యాపిటల్స్‌ కోచ్‌, రికీ పాంటింగ్ కలిశాడు. దిల్లీ క్యాపిటల్స్‌ ప్లేయర్స్‌ అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, రిషభ్​ పంత్‌తో ముచ్చటించాడు. ఆ తర్వాత హార్దిక్‌, రికీ మధ్య చిన్న ఆసక్తికర కన్వర్జేషన్‌ జరిగింది.

‘రికీ! ఆల్​ ఈజ్‌ ఎవ్రీథింగ్‌? హౌ ఈజ్‌ యుర్​ ఫ్యామిలీ?’ అని హార్దిక్ పాండ్యా అడిగాడు. దీనికి స్పందిస్తూ, ‘అందరూ బావున్నారు, నీ ఫ్యామిలీ ఎలా ఉంది?’ అని రికీ అడిగాడు. హార్దిక్ పాండ్యా, ‘ఆల్ గుడ్. ఆల్ స్వీట్’ అని బదులిచ్చాడు. దీంతో హార్దిక్‌ పాండ్యా విడాకుల వివాదానికి, రూమర్లకు ఫుల్‌ స్టాప్‌ పడింది. హార్దిక్ క్లియర్‌, షార్ట్‌ ఆన్సర్‌, మిస్టర్, మిసెస్ పాండ్యా మధ్య అంతా బాగానే ఉందని స్పష్టం చేస్తోంది. 'ఎ డే ఇన్ రికీ పాంటింగ్స్ లైఫ్' అనే వీడియోను ఐసీసీ తన యూట్యూబ్ ఛానెల్‌లో షేర్ చేసింది. అందులో పాండ్యా కన్వర్జేషన్‌ వినవచ్చు.

  • ఫామ్‌ అందుకున్న హార్దిక్ పాండ్యా
    టీ20 వరల్డ్‌ కప్‌కు ముందు బంగ్లాతో జరిగిన వార్మప్‌ మ్యాచ్లో 40 పరుగులు చేసి, ఒక వికెట్ తీశాడు. వరల్డ్‌ కప్‌లో ఐర్లాండ్‌పై జరిగిన మ్యాచ్‌లో కేవలం 27 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. పాక్‌ మ్యాచ్‌లో ఫఖర్ జమాన్. షాదాబ్ ఖాన్‌ను షార్ట్ డెలివరీలతో అవుట్ చేసి మ్యాచ్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు. యూఎస్‌ఏపై కూడా 2/14తో అద్భుత గణాంకాలు నమోదు చేశాడు. కొన్ని నెలలుగా వచ్చిన విమర్శలు, రూమర్లను పక్కన పెట్టి హార్దిక్‌ గేమ్‌పై ఫోకస్‌ చేసినట్లు స్పష్టమవుతోంది. ఈ ఆల్‌ రౌండర్‌ ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే టీమ్ ఇండియా కప్పు గెలిచే అవకాశాలు మెరుగవుతాయి.

ఫ్లోరిడాలో భారీ వర్షాలు - పాకిస్థాన్ 'సూపర్ 8' ఆశలు ఆవిరి! - T20 world cup elimination

కోహ్లీకి ఏమైంది? - ఆందోళనలో ఫ్యాన్స్​! - T20 Worldcup 2024

ABOUT THE AUTHOR

...view details