తెలంగాణ

telangana

డివోర్స్ రూమర్స్ నడుమ కుమారుడితో పయనం - హార్దిక్ సతీమణి స్టోరీ అందుకోసమేనా? - Hardik Pandya Wife

By ETV Bharat Telugu Team

Published : Jul 17, 2024, 1:40 PM IST

Hardik Pandya Wife Serbia Visit : విడాకుల రూమర్స్​ నెట్టింట హల్​చల్​ చేస్తున్న వేళ టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్ పాండ్య సతీమణి నటాషా స్టాంకోవిచ్‌ తన కుమారుడు అగస్త్యను తీసుకొని ముంబయి నుంచి సెర్బియాకు వెళ్లినట్లు తెలుస్తోంది. అసలేం జరిగిందంటే?

Hardik Pandya Wife Serbia Visit
Hardik Pandya (Getty Images)

Hardik Pandya Wife Serbia Visit : టీమ్ఇండియా ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్య సతీమణి తాజాగా ముంబయి ఎయిర్​పోర్ట్​లో కనిపించింది. ఆమె తన కుమారుడిని అగస్త్యను తీసుకొని సెర్బియాకు వెళ్లినట్లు సమాచారం. బుధవారం ఉదయం ముంబయి విమానాశ్రయం నుంచి బయలుదేరుతన్న సమయంలో తీసిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి.

ఇక ఇదే విషయంపై నటాషా ఇన్​స్టాగ్రామ్​ వేదికగా ఓ పోస్ట్ షేర్ చేసింది. లాగేజీను ఫొటో తీసి 'ఈ సంవత్సరంలో ఆ సమయం వచ్చింది అంటూ ఏడుపు ఎమోజీ, ఫ్లైట్​, అలాగే ఇల్లు, హార్ట్ సింబల్స్​ ఎమోజీని క్యాప్షన్​కు జతచేసింది. మరోవైపు ఆమె తన పెంపుడు కుక్క ఫొటోను కూడా అప్​లోడ్​ చేసింది.

హార్దిక్ పాండ్య , నటాషా చుట్టూ తిరుగుతున్న రూమర్స్ నేపథ్యంలో ఈ జర్నీ అలాగే నటాషా చేసిన ఈ పోస్ట్ అభిమానులకు ఆందోళన కలిగిస్తోంది. 'అసలు ఈ ఇద్దరి మధ్య ఏం జరుగుతోంది?' అంటూ నెట్టింట క్రికెట్​ లవర్స్ కామెంట్లు పెడుతున్నారు.

అయితే గత కొంతకాలం నుంచి ఈ ఇద్దరూ విడిపోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. మనస్పర్థలు రావడంతో వల్ల వీరిద్దరూ విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు కూడా ఊహాగానాలు వినిపించాయి. అయితే వీటిపై ఇప్పటివరకు అఫీషియల్​గా ఎటువంటి క్లారిటీ రాలేదు.

మరోవైపు హార్దిక్ త్వరలో శ్రీలంకతో జరగనున్న వన్డే సిరీస్‌కు దూరంగా ఉండనున్నాడని సమాచారం. వ్యక్తిగత కారణాల వల్ల లంకతో వన్డేలకు అందుబాటులో ఉండనంటూ అతడు బీసీసీఐకి సమాచారం కూడా ఇచ్చాడట. దీంతో భార్యతో విడాకులు తీసుకునేందుకే హార్దిక్ ఇలా చేస్తున్నట్లు జరుగుతున్న పరిణామాలు బట్టి అర్థమవుతోందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

ఇదిలా ఉండగా, వన్డే సిరీస్ కంటే ముందు జరిగే టీ20 సిరీస్‌లో మాత్రం హార్దిక్ పాల్గొనే అవకాశాలున్నాయి. కొంతకాలంగా టీ20ల్లో కెప్టెన్‌గా ఉన్న హార్దిక్‌ను లంకతో పొట్టి సిరీస్‌కు కెప్టెన్​గా ఎంపిక చేయకపోవచ్చనే వార్తలు కూడా వస్తున్నాయి. అతడి బదులు సూర్యకుమార్ యాదవ్‌కు సారధ్య బాధ్యతలు అప్పగించే అవకాశముందని బీసీసీఐ వర్గాల మాట.

'హార్దిక్​కు కూడా ఎమోషన్స్ ఉంటాయి'- కృనాల్ ఇన్​స్టా పోస్ట్ వైరల్ - Hardik Pandya World Cup 2024

'ఐయామ్‌ సారీ' - హార్దిక్‌కు క్షమాపణలు చెబుతున్న ముంబయి ఫ్యాన్స్​ - Mumbai Fans Sorry To Hardik

ABOUT THE AUTHOR

...view details