Hardik Pandya T20 World Cup:2024 ఐపీఎల్లో ముంబయి ఇండియన్స్ కెప్టెన్, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య ప్రదర్శన అంతగా బాగాలేదు. బ్యాటింగ్‌లో పెద్దగా రాణించని హార్దిక్, బౌలింగ్‌లోనూ విఫలమవుతున్నాడు. ప్రస్తుత సీజన్లో 4 ఇన్నింగ్స్‌ల్లో బౌలింగ్ చేసిన హార్దిక్ ఏకంగా 12 ఎకానమీతో 132 పరుగులు సమర్పించుకున్నాడు. అందులో కేవలం మూడు వికెట్లే తీశాడు. దీంతో సోషల్ మీడియాలో హార్దిక్ తీవ్రంగా ట్రోలింగ్‌కు గురవుతున్నాడు. ఫామ్‌లో లోకపోయినా బౌలింగ్ వేయడం దేనికంటూ ముంబయి ఫ్యాన్స్ అతడిపై మండిపడుతున్నాడు. అయితే హార్దిక్ ఫామ్ లో లేకపోయినా బౌలింగ్ చేయడానికి ఓ కారణం ఉందట. అదేంటో తెలుసా?
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్, సెలెక్టర్లు గత వారం ముంబయిలో సమావేశమయ్యారట. ఈ క్రమంలో 2024 టీ20 వరల్డ్ కప్‌లో చోటు దక్కించుకోవాలంటే ఐపీఎల్ బౌలింగ్ చేసి సత్తా చాటాలని హార్దిక్‌కు వారు సూచించారట. తిరిగి ఫామ్ అందుకొని ఐపీఎల్లో రాణిస్తే పొట్టికప్‌లో చోటు దక్కుందని అన్నారట. అందుకే అంతగా ఫామ్‌లో లేకపోయినా ఐపీఎల్లో హార్దిక్ బౌలింగ్ చేస్తున్నాడని టాక్.
ప్రస్తుత ఐపీఎల్లో హార్దిక్ కెప్టెన్సీపై సైతం విమర్శలు వస్తున్నాయి. ఇటీవల చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. ఆఖరి ఓవర్లో చెన్నై బ్యాటర్ మహేంద్ర సింగ్ ధోనీకి మూడు సిక్సర్లు, సహా 26 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో ఫామ్ లేనప్పుడు బౌలింగ్ ఎందుకు చేయడమని నెటిజన్లు సోషల్ మీడియాలో హార్దిక్‌ను టార్గెట్ చేశారు.