Hardik Natasa Divorce : టీమ్ ఇండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యాకు దెబ్బ మీద దెబ్బ తగిలినట్లుగా అయింది. ముంబయి ఇండియన్స్ కెప్టెన్‌గా విఫలమైన అతడు పర్సనల్ లైఫ్‌లోనూ కష్టాలు పడుతున్నట్లు తెలుస్తోంది. తన భార్య నటాషాతో విడిపోతున్నాడంటూ రెండు మూడు రోజుల నుంచి వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ జంట కోర్టును ఆశ్రయించినట్లు సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఒకవేళ విడాకులు మంజూరు అయితే హార్దిక్ భరణం కింద తన ఆస్తుల్లో 70 శాతం తనకు, తన కొడుకుకు చెందాలని నటాషా విడాకుల నోటీసులో పేర్కొన్నట్లు ప్రచారం సాగుతోంది. మరి ఇందులో నిజమెంతో స్పష్టత లేదు.
అనుమానాలు నిజమేనా? - తన సోషల్ మీడియా అకౌంట్‌లో నటాషా స్టాన్కోవిక్ పాండ్యా నుంచి నటాషా స్టాన్కోవిక్‌కు పేరు మార్చేసుకోవడంతో ఈ అనుమానాలకు ఆజ్యం పోసినట్లు అయింది. అంతేకాకుండా ఐపీఎల్ 2024 సీజన్లో ఒక్కసారి కూడా స్టేడియంలో కనిపించలేదు నటాషా. మిగిలిన క్రికెటర్ల భార్యలు, గర్ల్ ఫ్రెండ్స్ వచ్చినట్లుగా స్టాండ్స్‌లో కూర్చొని కనిపించలేదు. ఒకరికొకరు పరిచయమైన తొలినాటి నుంచి ప్రతి విషయాన్ని సోషల్ మీడియా పంచుకునేవారు ఈ జంట. అలాంటిది నటాషా, హార్దిక్‌లు కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఎటువంటి అప్‌డేట్‌ను పోస్టు చేయలేదు. చివరికి నటాషా బర్త్ డే అయిన మార్చి 4న కూడా హార్దిక్ పాండ్యా ఒక్క పోస్టు కూడా చేయలేదు. దీనిని బట్టి వారిద్దరి మధ్య ఏదో జరుగుతుందంటూ ఊహాగానాలు వినిపించడం మొదలయ్యాయి.
కాగా, 2018లో ముంబయి నైట్ క్లబ్‌లో కలుసుకున్న హార్దిక్ పాండ్యా - నటాషా స్టాన్కోవిక్‌లు కొన్నేళ్ల పాటు డేటింగ్‌లో ఉండి 2020 మేలో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. కొవిడ్-19 లాక్ డౌన్ సమయంలోనే జులైలో తమ తొలి బిడ్డ అగస్త్య పాండ్యాకు జన్మనిచ్చారు. తమ వెడ్డింగ్ వేడుకను సెలబ్రేట్ చేసుకుంటూ ఫిబ్రవరి 2023లో హిందూ, క్రిష్టియన్ సంప్రదాయాల్లో రెండు పద్ధతుల్లో పెళ్లి చేసుకున్నారు.