GT VS PBKS IPL 2024 :ఐపీఎల్ 2024లో భాగంగా జరిగిన 18వ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్‌లు ఉత్కంఠభరితంగా తలపడ్డాయి. పంజాబ్ కింగ్స్ చివరి వరకూ పోరాడి 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. దాదాపు గుజరాత్ గెలుస్తుందనుకున్న తరుణంలో అశుతోష్ శర్మ గేమ్‌ను మలుపుతిప్పాడు. దీనిపై మ్యాచ్ అనంతరం గిల్ ఇలా మాట్లాడాడు.
"మేం ఓ రెండు క్యాచ్ లు వదిలేశాం. లేదంటే వాళ్లు గెలిచి ఉండాల్సింది కాదు. మా బౌలింగ్ బాగుంది. బంతి నేరుగా బ్యాట్ మీదకు వస్తుంటే డిఫెండ్ చేయడం చాలా కష్టం. కొత్త బంతితో కాస్త ఇబ్బందిపడ్డా. 200 పరుగుల లక్ష్యం కాపాడుకుంటే గెలిచేవాళ్లం. 15వ ఓవర్ వరకూ గేమ్ మా చేతిలోనే ఉంది. ఇలా ఒత్తిడికి గురైనప్పుడు క్యాచ్‌లు వదిలేస్తారు. చివర్లో 7పరుగులు కావాల్సినప్పుడు నల్కండేతో బౌలింగ్ వేయించడం వెనుక ఎటువంటి వ్యూహం లేదు. అనామక ఆటగాళ్లు వచ్చి ఆడగలగడమే ఐపీఎల్ బ్యూటీ" అని తెలిపాడు.
క్యాచ్‌లు జారవిడిచిందిలా:
17వ ఓవర్ జరుగుతున్నప్పుడు, అప్పటికీ అశుతోష్ శర్మ 3 బంతులకు 3 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఆ సమయంలో ఉమేశ్ యాదవ్ క్యాచ్ మిస్ చేయడంతో 17 బంతులకు 31పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత ఓవర్లో శర్మ ఆడిన బంతిని మరోసారి జారవిడవడంతో సాయి సుదర్శన్ ఇంకో అవకాశాన్ని చేజార్చుకునేలా చేశాడు.