తెలంగాణ

telangana

ETV Bharat / sports

సీనియర్లపై గంభీర్ స్ట్రిక్ట్​ యాక్షన్​ - 'ఇకపై ప్రాక్టీస్​కు వారు కూడా రావాల్సిందే'

రెండో టెస్ట్​లోనూ భారత్ విఫలం - సీనియర్లపై గంభీర్ స్ట్రిక్ట్​ యాక్షన్​!

Gautam Gambhir
Gautam Gambhir (Associated Press)

By ETV Bharat Sports Team

Published : 4 hours ago

Gautam Gambhir IND Vs NZ Test Series : సొంత గడ్డపై టెస్టుల్లో తాజాగా ఎదురైన పరాభవం టీమ్ఇండియా ఊహించని విషయం. అత్యుత్తమ పెర్ఫామెన్స్ ఇవ్వడంలో భారత బ్యాటర్ల ఘోరంగా విఫలం అవ్వడం వల్ల కివీస్‌ చేతిలో ఈ టెస్టు సిరీస్‌ను ఓడాల్సి వచ్చిందని క్రికెట్ వర్గాల మాట. స్వదేశంలో తిరుగులేదని భావించిన భారత్‌కు ఇది పెద్ద షాక్ అనే చెప్పాలి.

మరోవైపు టీమ్​తో పాటు తాజాగా హెడ్​ కోచ్​గా బాధ్యతలు చేపట్టిన గౌతమ్ గంభీర్‌కు ఈ ఓటమి ఊహించని విధంగా షాకిచ్చింది. ఈ నేపథ్యంలో గంభీర్‌ తాజాగా జట్టుపై కఠిన చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు సీనియర్లకు ఇస్తోన్న 'ఆప్షనల్ ట్రైనింగ్‌' సెషన్‌ అవకాశాన్ని కూడా ఈ చర్యల్లో భాగంగా రద్దు చేసినట్లు సమాచారం.

అసలు ఏంటీ 'ఆప్షనల్ ట్రైనింగ్‌' ?
ఏదైనా సిరీస్‌కు ముందు ప్రాక్టీస్​లో భాగంగా ప్లేయర్లకు ట్రైనింగ్‌ సెషన్లు నిర్వహిస్తుండటం సహజం. అయితే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్‌ప్రీత్ బుమ్రా లాంటి టాప్ స్టార్లకు ఇది ఆప్షనల్‌గా ఉండేది. ప్రాక్టీస్​లో వీరు గాయపడితే ఇబ్బంది అవుతుందనే ఉద్దేశం, అలాగే వ్యక్తిగత పనుల నిమిత్తం వారికి విశ్రాంతినిచ్చేవాళ్లు. కానీ ఇప్పుడీ ఓటమి వల్ల ఇక నుంచి ప్రతి ప్లేయర్​ ఆ సెషన్‌కు హాజరు కావాల్సిందేనంటూ మేనేజ్‌మెంట్ తాజాగా పేర్కొన్నట్లు తెలుస్తోంది.

"మూడో టెస్టు ప్రారంభానికి ముందు ఓ రెండు రోజుల ట్రైనింగ్ సెషన్​ను నిర్వహించాలని మేనేజ్‌మెంట్ భావిస్తోంది. అక్టోబర్ 30-31 వరకు ఈ సెషన్‌ జరగనుంది. దీనికి ప్రతి ఒక్కరూ హాజరు కావల్సిందేనని ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. ఎవరూ కూడా ఈ సెషన్​ను మిస్‌ కావద్దు. టాప్‌ ఆటగాళ్లు కూడా రావాల్సిందే" అని మేనేజ్​మెంట్​ పేర్కొన్నట్లు క్రికెట్ వర్గాలు తాజాగా వెల్లడించాయి.

మరోవైపు కివీస్‌తో మూడో టెస్టు నవంబర్ 1 నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఈ చివరి మ్యాచ్‌లోనైనా గెలిచి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ అవకాశాలను మెరుగుపర్చుకోవాలనే లక్ష్యంతో ఇప్పుడు భారత్ బరిలోకి దిగనుంది. చూడాలి ఈ ట్రైనింగ్ సెషన్ ఎలా సాగనుందో?

కివీస్​తో సిరీస్ ఓటమి- భారత్​ WTC ఫైనల్​ ఛాన్స్​లు ఎలా ఉన్నాయంటే?

రెండో టెస్టులోనూ భారత్ ఓటమి- స్వదేశంలో సిరీస్ చేజారే

ABOUT THE AUTHOR

...view details