తెలంగాణ

telangana

ETV Bharat / sports

అదరగొట్టిన సాత్విక్‌, చిరాగ్‌ జోడీ - రెండో సారి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ కైవసం - FrenchOpen Chirag Shetty Rankireddy

French Open 2024 Chirag Shetty and Rankireddy : ఫ్రెంచ్ ఓపెన్‌లో భారత స్టార్‌ షట్లర్ల ద్వయం సాత్విక్‌-చిరాగ్‌ శెట్టి జోడి అదరగొట్టింది. టైటిల్​ను ముద్దాడింది.

అదరగొట్టిన సాత్విక్‌, చిరాగ్‌ జోడీ - ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ కైవసం
అదరగొట్టిన సాత్విక్‌, చిరాగ్‌ జోడీ - ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ కైవసం

By ETV Bharat Telugu Team

Published : Mar 10, 2024, 10:40 PM IST

Updated : Mar 11, 2024, 10:16 AM IST

French Open 2024 Chirag Shetty and Rankireddy : భారత స్టార్‌ షట్లర్ల ద్వయం సాత్విక్‌ - చిరాగ్‌ శెట్టి జోడీ మళ్లీ అదరగొట్టింది. ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో మెన్స్ డబుల్స్ టైటల్​ను ముద్దాడింది. త్వరలో జరగనున్న ఒలింపిక్‌ పతకమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఈ జోడీ తాజాగా ఫ్రెంచ్ ఓపెన్‌లో వ‌ర‌ల్డ్ ఛాంపియన్లకు దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చింది. ఈటోర్నీలో సెమీస్​లో అదరగొట్టిన సాత్విక్‌ - చిరాగ్‌ శెట్టి జోడీ ఆదివారం జరిగిన ఫైనల్​లోనూ దూకుడుగా ఆడి విజయం సాధించింది. ఫైనల్​లో చైనీస్ తైపీ జంట లీ జి హుయ్- యాంగ్​పొ సువాన్‌పై భారత ద్వయం 21-11, 21-17 తేడాతో వరుస గేమ్స్‌లో నెగ్గారు. ఫలితంగా ఫ్రెంచ్ ఓపెన్ డబుల్స్​ టైటల్​ను తన ఖాతాలో వేసుకుంది. కాగా, ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ విభాగంలో టైటిల్ సాధించడం ఈ జోడీకి ఇది రెండోసారి కావడం విశేషం.

రసవత్తరంగా సాగుతుందనుకున్న తుదిపోరును మన బ్యాడ్మింటన్ స్టార్లు కేవలం 37 నిమిషాల్లోనే పూర్తిచేశారు. ఈ కాస్త సమయంలోనూ భారత ద్వయం ప్రత్యర్థి జోడీపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. తొలి గేమ్‌లో 15 నిమిషాల్లోనే ప్రత్యర్థిని చిత్తుగా ఓడించారు. తొలుత 4-4తో స్కోరుగా సమంగా ఉండటంతో హోరాహోరీ పోరుగా సాగుతుందనుకుంటే వన్‌సైడ్‌‌గా మారింది. సాత్విక్-చిరాగ్ అద్భుత ఆటతో ప్రత్యర్థిని బెంబేలెత్తించారు.

ఇక తొలి గేమ్‌లో దూసుకు వెళ్లిన ఈ ద్వయం రెండో గేమ్‌లో మాత్రం గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వచ్చింది. అయినప్పటికీ రెండో గేమ్‌లో కూడా ప్రత్యర్ధి జోడీని సాత్విక్‌ - చిరాగ్‌ శెట్టి ద్వయం నిలువరించగలిగింది. శక్తిమంతమైన స్మాష్‌లతో, మెరుపు దాడులతో ప్రత్యర్థిని ఓడించింది. తద్వారా బీడబ్ల్యూఎఫ్ ర్యాంకింగ్స్​లో 100,000 పాయింట్స్ సాధించిన తొలి భారత జోడీగా నిలిచింది. ఇక ఇదే టోర్నీలో పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో చైనా షట్లర్‌ షి యుకీ గెలుపొందాడు. అతడు తన ప్రత్యర్థి థాయ్‌లాండ్ స్టార్ కునావుట్‌‌పై 22-20, 21-19 తేడాతో విజయం సాధించాడు.

WPL 2024 ఉత్కంఠ మ్యాచ్​లో ఆర్సీబీపై దిల్లీ విజయం - ప్లేఆఫ్స్​కు అర్హత

టీమ్​ఇండియాను ఊరిస్తోంది అదొక్కటే - ఈ సారైనా చేజిక్కేనా?

Last Updated : Mar 11, 2024, 10:16 AM IST

ABOUT THE AUTHOR

...view details