Expensive Overs In T20 Cricket:అఫ్గానిస్థాన్‌తో రీసెంట్గా ముగిసిన టీ 20 సిరీస్‌ను 3-0తో భారత్ క్లీన్‌స్వీప్ చేసింది. ఈ సిరీస్ మూడో మ్యాచ్ భారత్ ఇన్నింగ్స్‌లో ఆఖరి ఓవర్లో బ్యాటర్లు రోహిత్ శర్మ, రింకూ సింగ్ విధ్వంసం సృష్టించారు. కరీమ్ జనత్ బౌలింగ్ చేసిన ఈ ఓవర్లో రోహిత్, రింకూ ఏకంగా 36 పరుగులు పిండుకున్నారు. ఇలా క్రికెట్ చరిత్రలో కొన్ని అద్భుత ఘట్టాలకు బౌలర్లు బలవుతుంటారు. మరి టీ20 క్రికెట్ చరిత్రలో ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు సమర్పించిన బౌలర్లెవరో చూద్దాం.
6 బంతుల్లో 6 సిక్స్‌లు:సింగిల్ ఓవర్లో 6 సిక్స్‌లు బాదిన తొలి క్రికెటర్‌గా టీమ్ఇండియా మాజీ ప్లేయర్ యువరాజ్ రికార్డు కొట్టాడు. 2007 తొలి టీ20 వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌పై నిర్ధాక్షిణ్యంగా విరుచుకుపడ్డాడు యువరాజ్. బ్రాడ్ వేసిన 19 ఓవర్‌లో వరుస సిక్సర్లతో చెలరేగిపోయిన యువరాజ్ కేవలం 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి ఫాస్టెస్ట్ ఫిఫ్టీ నమోదు చేశాడు.
అఖిల ధనుంజయ vs పొలార్డ్:వెస్టిండీస్ హిట్టర్ కీరన్ పోలార్డ్ విధ్వంసకర బ్యాటింగ్‌తో ఈ లిస్టులో రెండోస్థానాన్ని ఆక్రమించాడు. 2021లో శ్రీలంకతో ఆంటిగ్వాలో జరిగిన టీ20లో పోలార్డ్ ఒకే ఓవర్లో ఆరు సిక్సులు బాదాడు. లంక లెగ్ స్పిన్నర్ అఖిల ధనుంజయ వేసిన ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో పొలార్డ్ వరుస సిక్సర్లు బాదాడు. ఫలితంగా అంతర్జాతీయ క్రికెట్‌లో ఒకే ఓవర్లో ఆరు సిక్సులు బాదిన మూడో బ్యాట్స్‌మన్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు. అంతర్జాతీయ టీ20లో భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ తర్వాత ఒకే ఓవర్లో ఆరు సిక్సులు బాదిన రెండో బ్యాట్స్‌మన్‌గా పోలార్డ్ పేరిట రికార్డు ఉంది.
శివమ్ దూబే @34 పరుగులు: టీమ్ఇండియా ఆల్‌రౌండర్ శివమ్ దూబే టీ20ల్లో ఒకే ఓవర్లో 34 పరుగులు సమర్పించుకొని చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. 2020లో జరిగిన భారత్- న్యూజిలాండ్ టీ20 మ్యాచ్‌లో టిమ్ సీఫెర్ట్, రాస్ టేలర్ చెలరేగిపోయారు. ఈ ఓవర్లో దూబే వరుసగా 6, 6, 4, 1, 4nb, 6, 6 సమర్పించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో కివీస్ భారీ స్కోర్ సాధించినప్పటికీ టీమ్ఇండియానే నెగ్గింది.