IAN BOTHAM FALLS INTO CROCODILES RIVER : ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ ఇయాన్ బోథమ్ త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. బోటుపై ప్రయాణిస్తూ ప్రమాదవశాత్తు నదిలో పడిపోయాడు. అతడిని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మెర్వ్ హ్యూస్ కాపాడాడు. ఇంతకీ ఏం జరిగిందంటే?
త్రుటిలో తప్పిన ప్రమాదం - ఇయాన్ బోథమ్ ఆస్ట్రేలియాలోని నార్తర్న్ టెరిటరీలో ఆసీస్ మాజీ ఆటగాడు మెర్వ్ హ్యూస్‌తో కలిసి నాలుగు రోజుల ఫిషింగ్ ట్రిప్‌కు వెళ్లాడు. ఈ క్రమంలో పడవ ఎక్కే సమయంలో బోథమ్ అదుపుతప్పి మోయల్ నదిలో పడిపోయాడు. వెంటనే అప్రమత్తమైన మెర్వ్ హ్యూస్ బోథమ్ సురక్షితంగా పడవలోకి చేర్చాడు. లేదంటే బోథమ్ ప్రాణాలకు ప్రమాదం ఉండేది. ఎందుకంటే మోయల్ నదిలో మొసళ్లు, బుల్ షార్కులు ఎక్కువగా ఉంటాయట. నదిలో ఎక్కువసేపు బోథమ్ ఉండి ఉంటే వాటి నుంచి ప్రమాదం ఎదురయ్యేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ ప్రమాదంలో బోథన్‌కు వీపు పక్క భాగం, మరికొన్ని చోట్ల గాయాలైనట్లు తెలుస్తోంది.
'క్షేమంగా ఉన్నా' -ఈ ప్రమాదంపై బోథమ్ స్పందించాడు. తనను రక్షించిన హ్యూస్, మరికొందరిపై ప్రశంసలు కురిపించాడు. తాను నీటిలోకి వెళ్లిన దాని కన్నా వేగంగా బయటకొచ్చానని చెప్పుకొచ్చాడు. నీటిలో ఏమి ఉన్నాయో కూడా ఆలోచించడానికి తనకు సమయం లేదని పేర్కొన్నాడు. తాను ఇప్పుడు క్షేమంగానే ఉన్నానని చెప్పుకొచ్చాడు.
వేర్వేరు దేశాలకు ఆడినా, బెస్ట్ ఫ్రైండ్సే