Disqualifed Players In Paris Olympics 2024 :భారత రెజ్లర్ వినేశ్ పొగాట్ స్వర్ణం కోసం జరగాల్సిన తుదిపోరులో బరువు ఎక్కువగా ఉండటం వల్ల డిస్‌క్వాలిఫై అయ్యారు. 2024 పారిస్ ఒలింపిక్స్ ఈవెంట్‌లోని రెజ్లింగ్ పోటీల్లో 50 కేజీల విభాగంలో ఆమె ఫైనల్‌లో తలపడాల్సి ఉంది. పోటీ జరిగే రోజు ఉదయం ఫిజికల్ మెజర్మెంట్స్ తీసుకుంటున్న సమయంలో వంద గ్రాముల బరువు ఎక్కువగా ఉందని తెలిసింది. దాంతో ఆమెను పోటీకి డిస్‌క్వాలిఫై చేశారు. ఇలా మల్టీనేషనల్ ఈవెంట్స్‌లో ఇండియన్ అథ్లెట్లు డిస్‌క్వాలిఫై అవడం తొలిసారేం కాదు. మేజర్ స్పోర్ట్స్ ఈవెంట్లలో దాదాపు 10 మంది డిస్‌క్వాలిఫై అయ్యారు. ఇంతకీ వారెవరంటే?
పర్వీన్ హూడా: 2024 ఒలింపిక్స్ ఈవెంట్లో 57 కేజీల విభాగంలో పాల్గొన్న ఈ బాక్సర్ సస్పెన్షన్‌కు గురయ్యారు. ఇంటర్నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జరిపిన డోపింగ్ పరీక్షల్లో ఫెయిల్ కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. డోపింగ్‌కు పాల్పడినట్లు తెలియడంతో ఆమె నుంచి 2022 హాంగ్జౌ ఏసియన్ గేమ్స్ కాంస్య పతకాన్ని కూడా రద్దు చేశారు.
సీమా అంటిల్ : ఇండియాకు చెందిన డిస్కస్ త్రోయర్ సీమా అంటిల్ కూడా డిస్‌క్వాలిఫై అయ్యారు. నాలుగు సార్లు కామన్వెల్త్ గేమ్స్‌లో పతకాలను గెలుచుకోవడంతో పాటు, 2002 వరల్డ్ జూనియర్ ఛాంపియన్‌షిప్స్‌లో గోల్డ్ మెడల్ కూడా దక్కించుకున్నారు. నాసల్/సైనస్ సమస్య ఉన్న వారు ఉపయోగించే సూడఫెడ్రైన్ అనే డ్రగ్ వాడటం వల్ల పోటీ నుంచి పక్కన పెట్టేశారు.
సునీతా రాణి : లాంగ్ డిస్టెన్స్ రన్నింగ్ పోటీల్లో పాల్గొనే సునీతా రాణి (పద్మ శ్రీ అవార్డు విన్నర్) 2002 ఆసియా గేమ్స్‌లో 1500 మీ పందెంలో స్వర్ణం, 5000మీ పందెంలో బ్రాంజ్ పతకాలను సాధించారు. ఆ తర్వాత డోపింగ్ టెస్టుల్లో ఫెయిల్ అయి పతకాలను విచారణ పూర్తయిన తర్వాత అందిస్తామంటూ హోల్డ్‌లో పెట్టింది.
అనిల్ కుమార్, నీలమ్ సింగ్:అర్జున అవార్డు గ్రహీతలైన డిస్కస్ త్రోయర్స్ అనిల్ కుమార్, నీలమ్ సింగ్. కామన్వెల్త్ గేమ్స్‌లో ఇండియాకు తొలి పతకాన్ని తెచ్చి డోపింగ్ కారణంగా రెండేళ్ల సస్పెన్షన్‌ను ఎదుర్కొన్నారు. నోరాండ్రోస్టిరాన్ అనే డ్రగ్ తీసుకోవడం వల్ల వీరిద్దరూ డోపింగ్‌లో పాజిటివ్‌గా తేలారు. దీంతో ఏసియన్ చాంపియన్‌షిప్స్‌కు అనర్హత వేటును ఎదుర్కొన్నారు అనిల్ కుమార్. నీలం సింగ్ కామెన్వెల్త్ గేమ్స్‌లో సాధించిన సిల్వర్ మెడల్ రద్దు అయింది.