Champions Trophy Varun Chakravarthy :సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో భారత్ ఓడినప్పటికీ యంగ్ స్పిన్నర్ వరున్ చక్రవర్తి ఆద్భుత ప్రదర్శన కనబర్చాడు. ప్రత్యర్థి బ్యాటర్లనూ బెంబేలెత్తిస్తూ ఏకంగా 5 వికెట్లు దక్కించుకున్నాడు. కాగా, ఇదే సిరీస్ తొలి మ్యాచ్‌లోనూ వరుణ్ ఆకట్టుకున్నాడు. ఆ మ్యాచ్‌లో 3 వికెట్లతో రాణించాడు. దీంతో ప్రస్తుత సిరీస్‌లోనే రెండు మ్యాచ్‌ల్లో 8 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు.
ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ దినేశ్ కార్తిక్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. వరుణ్ లాంటి టాలెంటెడ్ ప్లేయర్లకు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని అభిప్రాయపడ్డాడు. ఒకవేళ 2025లో ఛాంపియన్స్ ట్రోఫీ జరిగితే ఈ టోర్నీలో వరుణ్‌కు టీమ్ఇండియాలో కచ్చితంగా చోటు కల్పించాలని పేర్కొన్నాడు. ఒకవేళ టీమ్ఇండియా అలా చేయకపోతే అది పెద్ద తప్పిదంగా మారే ఛాన్స్ ఉందని తెలిపాడు.
'2025 ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ విషయంలో క్లారిటీ లేదు. అయితే అది మన చేతుల్లో లేని అంశం. కానీ, ఒకవేళ ఈ టోర్నీ జరిగితే మాత్రం భారత్ తప్పకుండా పాల్గొంటుంది. అప్పుడు వరుణ్ చక్రవర్తి వంటి మిస్టరీ స్పిన్నర్‌కు జట్టులో స్థానం ఇవ్వాలి. లేకపోతే అది టీమ్‌ఇండియా మేనేజ్‌మెంట్ చేసిన ఘోర తప్పిదం అవుతుంది' అని దినేశ్ కార్తిక్ సోషల్ మీడియాలో పేర్కొన్నాడు.