Dhoni Deepika Relationship :టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ ధోనీ, బాలీవుడ్ దీవా దీపికా పదుకుణె రిలేషన్షిప్లో ఉన్నట్లు గతంలో పలు వార్తలు చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. ఈ ఇద్దరూ కలిసి చాలా చోట్ల కనిపించారంటూ మీడియా వర్గాల్లో టాక్ కూడా నడిచింది. అయితే ఈ కపుల్ తమపై వచ్చిన రూమర్స్‌లో ఏమాత్రం నిజం లేదంటూ కొట్టిపడేసేవారు. అయితే ధోనీతోనే కాకుండా క్రికెటర్ యువరాజ్ సింగ్‌తోనూ దీపికా లవ్‌లో ఉందంటూ మాట్లాడుకునేవారు. కానీ క్రికెట్ ఫ్యాన్స్‌తో పాటు సెలబ్రిటీలు వాళ్లను సరదాగా ఆటపట్టించిన సందర్భాలు ఉన్నాయి. బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ కూడా ఓ ఫంక్షన్‌లో ఈ రూమర్స్‌ని ఉద్దేశించి ధోనీతో పాటు యువరాజ్‌ను ఆటపట్టించారు.
షారుక్ ఓ సారి భారత్, పాకిస్థాన్ జట్లు పాల్గొన్న షోను హోస్ట్ చేశారు. ప్రోగ్రామ్‌లో భాగంగా ధోనీని వేదికపై పిలిచిన ఆయన తనతో కాసేపు ముచ్చటించారు. ఆ సమయంలో ధోనీ, దీపికాను ఉద్దేశిస్తూ సరదాగా మాట్లాడారు. అయితే ఉన్నట్లుండి ఆ సమయంలో యువరాజ్ గురించి టాపిక్ రావడం వల్ల షారుక్ అతడ్ని కూడా ఆటపట్టించారు. దీనికి సంబంధించిన ఓ పాత వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
"నేను మీకు ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. దీపిక అనే హీరోయిన్‌తో నేను సినిమా చేస్తున్నాను. బహుశా మీరు ఆమె గురించి వినుండకపోవచ్చు" అని షారుక్ అన్నారు. ఇక తనను ఆటపట్టించేందుకు షారుక్ రెడీ అయ్యారని తెలుసుకున్న ధోనీ వెంటనే సరదాగా రిప్లై ఇచ్చాడు. "యువీకి (యువరాజ్ సింగ్) ఆమె తెలుసు." అని మాహీ అన్నాడు. ఇక ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్న షారుక్, వెంటనే యువరాజ్‌ను ఆటపట్టించే పనిలో పడిపోయారు. "అవును, అవును, యువీకి ఆమె తెలుసు, ఆమె అతని సోదరి" అని షారుక్ అన్నారు. దీంతో అక్కడివారంతా ఒక్కసారిగా నవ్వుతారు.