తెలంగాణ

telangana

ETV Bharat / sports

క్రికెట్ లవర్స్​కు బంపర్ ఆఫర్- విరాట్ మ్యాచ్​కు ఎంట్రీ ఫ్రీ - VIART KOHLI RANJI

క్రికెట్ ఫ్యాన్స్​కు బంపర్ ఆఫర్- దిల్లీ మ్యాచ్​కు టికెట్ లేకున్నా ఎంట్రీ

Viart Kohli
Viart Kohli (Source : Associated Press)

By ETV Bharat Sports Team

Published : Jan 26, 2025, 4:36 PM IST

Viart Kohli Ranji : టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ సహా, స్టార్ ప్లేయర్లంతా డొమెస్టిక్​ టోర్నీలో ఆడుతున్నారు. రోహిత్, జైస్వాల్, రిషభ్ పంత్, శుభ్​మన్ గిల్, రవీంద్ర జడేజా రీసెంట్​గా రంజీ ట్రోఫీలో ఆడారు. కానీ, సీనియర్ ప్లేయర్ విరాట్ కోహ్లీ మాత్రం మెడనొప్పి కారణంగా బరిలోకి దిగలేదు. అయితే జనవరి 30 నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకు రంజీలో ఇంకో రౌండ్ మ్యాచ్​లు జరగనున్నాయి. ఈ రౌండ్​లోనైనా విరాట్ బరిలోకి దిగుతాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

అటు దిల్లీ క్రికెట్ అసోసియేషన్ కూడా అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేస్తోంది. అరుణ్‌ జైట్లీ స్టేడియంలో రైల్వేస్‌ జట్టుతో దిల్లీ తలపడనుంది. అయితే గత మ్యాచ్‌లో ఘోరంగా ఓడిన దిల్లీ, ఈసారి ఎలాగైనా విజయం సాధించాలని ఆశిస్తోంది. ఆ మ్యాచ్​లో కెప్టెన్​ ఆయుష్‌ బదోని ఒక్కడే రాణించగా, పంత్ విఫలమయ్యాడు. దీంతో విరాట్ కోహ్లీపై జట్టు భారీగా ఆశలు పెట్టుకుంది.

దాదాపు 13ఏళ్ల తర్వాత డొమెస్టిక్ బరిలోకి దిగుతున్న విరాట్​ను చూసేందుకు భారీగా అభిమానులు స్టేడియానికి తరలి వస్తారని దిల్లీ అసోసియేషన్ భావిస్తోంది. దీంతో భద్రతను పెంచాలని నిర్ణయించింది. సుమారుగా 10వేల మందికిపైగా ప్రేక్షకులు వస్తారని అంచనా వేస్తోంది. అందుకు కోసం నార్త్‌ ఎండ్, ఓల్డ్‌ క్లబ్‌ హౌస్‌ను ఓపెన్‌ చేయాలని డిసైడ్ అయ్యిందట. అవసరమైతే అదనపు సీటింగ్‌ సిద్ధం చేయనుంది. కాగా, ఈ మ్యాచ్​కు ఎలాంటి టికెట్ అవసరం లేకుండా, ప్రతి ఒక్కరు స్టేడియంలో ఉచితంగా మ్యాచ్​ చూసే అవకాశం కల్పించనుంది.

ABOUT THE AUTHOR

...view details