Rishabh Pant Suspended:దిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్‌కు షాక్ తగిలింది. ఇటీవల రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ కారణంగా పంత్‌పై బీసీసీఐ ఓ మ్యాచ్ నిషేధం విధించింది. దీంతోపాటు రూ.30 లక్షల జరిమానా విధిస్తున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొంది. ఇక దిల్లీ మే 12న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌కు పంత్ దూరం కానున్నాడు. ప్లే ఆఫ్స్‌కు ముంగిట పంత్‌పై వేటు పడడం దిల్లీ ఫ్యాన్స్ ఆందోళనకు గురవుతున్నారు.
గతంలో హెచ్చరిక:అయితే ఇదే సీజన్లో పంత్ మూడుసార్లు స్లో ఓవర్ రేట్‌కు గురయ్యాడు. ఈ క్రమంలో పంత్ ఇప్పటికే పలుమార్లు భారీ జరిమానాలు ఎదుర్కొన్నాడు. ఐపీఎల్ నిబంధనల ప్రకారం తొలిసారి స్లో ఓవర్ రేట్‌కు గురైతే రూ. 12 లక్షలు, రెండోసారికి రూ.24 లక్షలు, మూడోసారి రిపీటైతే మ్యాచ్ ఫీజులో 100శాతం కోత ఉంటుంది. దీంతోపాటు ఓ మ్యాచ్‌లో ఆడకుండా నిషేధిస్తారు.
ఈ నేపథ్యంలో పంత్‌పై గతనెల ముంబయి ఇండియన్స్‌తో మ్యాచ్ తర్వాతే వేటు పడాల్సి ఉంది. ఇక రీసెంట్గా రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇదే పొరపాటు రిపీట్ అయ్యింది. దీంతో దిల్లీ కెప్టెన్ పంత్‌పై వేటు పడింది. కాగా, ఈ మ్యాచ్‌లో రాజస్థాన్‌పై దిల్లీ 20 పరుగుల తేడాతో గెలుపొందింది.