తెలంగాణ

telangana

ETV Bharat / sports

హైదరాబాద్​ను మిస్ అవుతున్న వార్నర్- తెలుగోళ్లతో డేవిడ్ భాయ్ బాండింగ్ అలాంటిది మరి! - David Warner - DAVID WARNER

David Warner misses Hyderabad: ఆస్ట్రేలియా క్రికెట్ స్టార్ వార్నర్​ తరచూ హైదరాబాద్​పై తనకున్న అభిమానాన్ని చాటుకుంటాడు. తాజాగా హైదరాబాద్​ను మిస్ అవుతున్నానంటూ వార్నర్ షేర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరలైంది.

David Warner
David Warner (Source: Getty Images)

By ETV Bharat Sports Team

Published : Aug 27, 2024, 5:01 PM IST

David Warner misses Hyderabad:ఆస్ట్రేలియా మాజీ బ్యాటర్ డేవిడ్ వార్నర్​కు తెలుగు క్రికెట్ ఫ్యాన్స్​కు మంచి అనుబంధం ఉంది. వార్నర్ ఐపీఎల్​లో సన్​రైజర్స్​ జట్టుకు ప్రాతనిధ్యం వహించడంతోపాటు తెలుగు హీరోల సినిమాల్లోని ఎన్నో సాంగ్స్​ను రీల్స్​గా చేసి ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమాల్లోని పాటలకు స్టెప్పులు వేసి, డైలాగ్స్ చెప్పి తెలుగు ఆడియెన్స్​కు మరింత దగ్గరయ్యాడు. దీంతో వార్నర్​కు తెలుగు క్రికెట్ ఫ్యాన్స్​తో చక్కటి అనుబంధం ఏర్పడింది.

అటు వార్నర్ కూడా తరచూ తెలుగు ఫ్యాన్స్​పై ఉన్న అభిమానాన్ని చాటుకుంటాడు. తాజాగా సోషల్ మీడియా పోస్ట్​తో వార్నర్ మరోసారి తెలుగు అభిమానుల దృష్టిని ఆకర్షించాడు. రంగురంగుల కాంతుల మధ్యలో వెలిగిపోతున్న ఛార్మినార్ ఫొటో ఒకటి షేర్ చేస్తూ, 'నాకు నచ్చిన ప్రదేశాలలో ఒకదాన్ని చాలా మిస్ అవుతున్నాను' అని రాసుకొచ్చాడు. దీంతో వార్నర్​కు హైదరాబాద్​తో విడదీయరాని బంధం ఉందంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. 2025 ఐపీఎల్​ మెగా వేలంలో ఎలాగైనా సన్​రైజర్స్​ వార్నర్​ను కొనుగోలు చేస్తే బాగుంటుందని తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

కాగా, 2014- 2021 మధ్యలో వార్నర్ సన్​రైజర్స్ తరఫున ప్రాతినిధ్యం వహించాడు. ఇందులో 2016 ఎడిషన్​లో తన సారథ్యంలోనే సన్​రైజర్స్​ ఛాంపియన్​గా నిలిచింది. ఈ ఎనిమిది ఎడిషన్​లలో కలిపి వార్నర్ సన్​రైజర్స్ తరఫున 95మ్యాచ్​లు ఆడాడు. అందులో 142.59 స్ట్రైక్ రేట్​తో 4014 పరుగులు చేశాడు. ఇక 2022 ఐపీఎల్​కు ముందు సన్​రైజర్స్ వార్నర్​ను వదులుకుంది. అప్పుట్నుంచి ఈ డాషింగ్ ఓపెనర్ దిల్లీ క్యాపిటల్స్​కు ఆడుతున్నాడు.

బన్ని- వార్నర్ తగ్గేదేలే
కరోనా సమయంలో, ఆ తర్వాత రీల్స్​తో హీరో అల్లు అర్జున్- వార్నర్ మధ్య స్నేహం ఏర్పడింది. వీరిద్దరూ వ్యక్తిగతంగా ఎప్పుడూ కలవకపోయినా, ఆన్​లైన్​లో ఇరువురు అప్పుడప్పుడు పలకరించుకుంటారు. పుట్టిన రోజు సందర్భంగా స్పెషల్​గా విషెస్ చెప్పుకుంటారు. ఇక వార్నర్ ఇప్పటికి అనేక సార్లు పుష్ప సినిమా 'తగ్గేదేలే' డైలాగ్ మేనరిజాన్ని గ్రౌండ్​లో అనేక సార్లు చేసి ఫ్యాన్స్​ను ఫుల్ ఖుషి చేశాడు.

Warner On Allu Arjun : 'పుష్ప'కు వార్నర్ విషెస్.. వెల్​డన్​ అంటూ..

వార్నర్​కు పోటీగా జడేజా.. 'పుష్ప' వీడియోతో 'తగ్గేదే లే'

ABOUT THE AUTHOR

...view details