తెలంగాణ

telangana

ETV Bharat / sports

రొనాల్డో@1 బిలియన్- సోషల్ మీడియాలో నయా రికార్డ్! - Cristiano Ronaldo Social Media - CRISTIANO RONALDO SOCIAL MEDIA

Cristiano Ronaldo One Billion Followers : స్టార్ ఫుట్​బాలర్ క్రిస్టియానో రొనాల్డో తాజాగా ఓ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. సోషల్ మీడియాలో ఫాలోవర్ల సంఖ్యను పెంచుకుని ఆయన ఈ నయా ఘనతను సాధించాడు. ఆ విశేషాలు మీ కోసం.

Cristiano Ronaldo One Billion Followers
Cristiano Ronaldo (Associated Press)

By ETV Bharat Sports Team

Published : Sep 13, 2024, 8:44 AM IST

Updated : Sep 13, 2024, 9:04 AM IST

Cristiano Ronaldo One Billion Followers :పోర్చుగల్ సాకర్ దిగ్గజ ప్లేయర్క్రిస్టియానో రొనాల్డో తాజాగా ఓ నయా రికార్డును తన పేరిట రాసుకున్నాడు. తన సోషల్‌ మీడియా ఖాతాలన్నింటిలో కలిపి అతడికి ఉన్న ఫాలోవర్ల సంఖ్య ఇప్పుడు ఏకంగా 100 కోట్లను దాటింది. ఇక ఈ సంతోషకరమైన విషయాన్ని రొనాల్డో తన అభిమానులతో పంచుకున్నాడు. వారికి థ్యాంక్స్​ చెప్తూ ఓ స్పెషల్ పోస్టర్ షేర్ చేశాడు.

"మేం చరిత్ర సృష్టించాం. 100కోట్ల ఫాలోవర్లు! ఇది కేవలం ఓ సంఖ్య మాత్రమే కాదు. అంతకుమించిన మీ ప్రేమాభిమానాలకు ఇది నిదర్శనం. మడైరా వీధుల నుంచి ప్రపంచంలోనే అతిపెద్ద వేదికల వరకు. నేను ఎల్లప్పుడూ నా కుటుంబంతో పాటు మీ కోసమే ఆడాను. ఇప్పుడు ఈ వంద కోట్ల మంది నా కోసం నిలబడ్డారు. నా అప్స్​ అండ్ డౌన్స్​లో, ప్రతి అడుగులోనూ మీరున్నారు. ఇది మన జర్నీ. మనమంతా కలిస్తే ఏదైనా సాధించగలమని నిరూపించాం. నాపై నమ్మకం ఉంచి. నన్ను ఎల్లప్పుడూ అండగా ఉన్నందుకు, నా జీవితంలో భాగమైనందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేనింకా బెస్ట్​ పెర్ఫామెన్స్​ చేయాల్సి ఉంది. మరిన్ని విజయాలు సాధించి సరికొత్త చరిత్ర సృష్టించాలి" అని రొనాల్డో ఫ్యాన్స్​ను ఉద్దేశించి పోస్ట్ పెట్టాడు.

ఆరు రోజుల్లో 50 మిలియన్లు!
Cristiano Ronaldo Youtube Channel: ఇటీవలే యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించిన రొనాల్డో ఆరు రోజుల్లోనే 50మిలియన్ల సబ్‌స్క్రైబర్ల మార్క్​ అందుకున్నాడు. ఈ క్రమంలో అతి తక్కువ సమయంలో 50మిలియన్ల సబ్‌స్క్రైబర్ల మైలురాయి అందుకున్న యూట్యూబర్​గా రొనాల్డో రికార్డు కొట్టాడు. కాగా, రొనాల్డో యువర్ క్రిస్టియానో (UR Cristiano) పేరుతో ఆగస్టు 21న యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించాడు.

దీనికి ఊహించని రేంజ్​లో రెస్పాన్స్ వచ్చింది. ఛానెల్ ప్రారంభించిన 90 నిమిషాల్లో 1మిలియన్, 12గంటలలోపే 13మిలియన్ల సబ్‌స్క్రైబర్లు అయ్యారు. దీంతో ఛానెల్ ఓపెనింగ్ రోజే రొనాల్డోకు యూట్యూబ్ నుంచి 'గోల్డెన్ ప్లే బటన్' అందింది. ఎప్పుడూ గ్రౌండ్​లో అదరగొట్టే రొనాల్డో యూట్యూబ్​లోనూ రికార్డులు సృష్టిస్తుండటం వల్ల ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం ఛానెల్​కు 50.3మిలియన్ సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ఇక రొనాల్డోకు ట్విట్టర్​లో 112.6మిలియన్, ఫేస్‌బుక్‌లో 170 మిలియన్, ఇన్‌స్టాగ్రామ్‌లో 636 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు.

చరిత్ర సృష్టించిన రొనాల్డో- 900వ గోల్​తో వరల్డ్ రికార్డ్ - Cristiano Ronaldo 900th Goal

యూట్యూబ్​లో రొనాల్డో- 12గంటల్లోనే కోటి సబ్‌స్క్రైబర్లు- ఫస్ట్​ రోజే గోల్డెన్ ప్లే బటన్ - Cristiano Ronaldo YouTube

Last Updated : Sep 13, 2024, 9:04 AM IST

ABOUT THE AUTHOR

...view details