Cricketers With Highest Debut Wickets :స్కాట్లాండ్ స్టార్ పేసర్ చార్లీ కాసెల్ తన అరంగేట్ర మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. ఏకంగా ఏడు వికెట్లు పడగొట్టి రికార్డు సృష్టించాడు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకూ వన్డే డెబ్యూ మ్యాచ్‌ల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్లు గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఫిడేల్ ఎడ్వర్డ్స్
వెస్టిండీస్ పేసర్ ఫిడెల్ ఎడ్వర్డ్స్ 2003 నవంబరులో జింబాబ్వేపై జరిగిన మ్యాచ్‌లో చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్‌లో 22 పరుగులు ఇచ్చి ఆరు వికెట్లు పడగొట్టాడు. వర్షం కారణంగా 45 ఓవర్లకు కుదించిన మ్యాచ్ లో విండీస్ జట్టు 256 పరుగులు చేసింది. ఆ జట్టు బ్యాటర్ వేవెల్ హిండ్స్ 127 పరుగులు చేశాడు. ఆ తర్వాత బాల్ అందుకున్న ఫిడెల్ ఎడ్వర్డ్స్ జింబాబ్వే జట్టు 72 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసేలా చేశాడు.
కగిసో రబాడ
2015లో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన రబాడ, తన తొలి వన్డే మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై 6/16 గణాంకాలను నమోదు చేశాడు. రబాడ విజృంభణతో ఈ మ్యాచ్‌లో బంగ్లా జట్టు 160 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ లక్ష్యాన్ని ప్రొటీస్ జట్టు బ్యాటర్లు అలవోకగా ఛేదించారు.