Cricketers Turned Politicians :దేశంలో క్రికెట్‌కు ఉండే క్రేజే వేరు. అందుకే క్రికెటర్లకు అభిమానులు నిరాజనం పడుతుంటారు. అయితే చాలా మంది దిగ్గజ క్రికెటర్లు మైదానంలోనే కాదు, రాజకీయల్లోనూ రాణించారు. వారెవరో? ఏ పార్టీ తరఫున పోటీ చేశారు? ప్రస్తుతం ఏ పదవిలో ఉన్నారు? తదితర విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.
1. గౌతమ్ గంభీర్
అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాక స్టార్ క్రికెటర్ గౌతమ్ గంభీర్ రాజకీయాల్లోకి వెళ్లారు. భారతీయ జనతా పార్టీలో (బీజేపీ)లో ఆయన 2019లో చేరారు. అదే ఏడాది జరిగిన లోక్ సభ ఎన్నికల్లో తూర్పు దిల్లీ నియోజకవర్గం ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. ప్రస్తుతం టీమ్‌ఇండియా హెచ్ కోచ్‌గా ఉన్నారు.
2. హర్భజన్ సింగ్
టీమ్‌ఇండియా మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ అంటే తెలియనివారుండరు. బజ్జీ చాలా మ్యాచ్‌ల్లో టీమ్‌ఇండియాకు విజయాలను అందించారు. అలాగే రాజకీయాల్లోనూ రాణించారు. 2022లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) తరఫున రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి రాజకీయాల్లో కొనసాగుతున్నారు.
3. నవజ్యోత్ సింగ్ సిద్ధూ
భారత మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ కూడా రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. ఆయన తొలుత బీజేపీలో జాయిన్ అయ్యారు. ఆ పార్టీ తరఫున 2004, 2009లో అమృత్ సర్ నుంచి ఎంపీగా రెండు సార్లు విజయం సాధించారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు.
4. మహ్మద్ కైఫ్
టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత మహ్మద్ కైఫ్ కూడా రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫుల్‌పుర్ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
5. ఎస్ శ్రీశాంత్
టీమ్ఇండియా మాజీ పేసర్ ఎస్ శ్రీశాంత్ కూడా రాజకీయ రంగప్రవేశం చేశారు. ఐపీఎల్‌లో ఫిక్సింగ్ ఆరోపణలతో అతడి క్రెకిట్ కెరీర్ అర్థాంతరంగా ముగిసిపోయింది. అయితే 2016లో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసి ఓటమిపాలయ్యారు.