Rohit Sharma Ranji Trophy :కెప్టెన్ రోహిత్ శర్మ రంజీ ట్రోఫీలో ఆడడంపై కొన్ని రోజులుగా క్రీడా వర్గాల్లో చర్చ జరుగుతోంది. హిట్‌మ్యాన్ రీసెంట్గా నెట్స్‌లో ప్రాక్టీస్ చేయడం వల్ల దేశవాళీలో ఆడడం పక్కా అని ప్రచారం సాగింది. అయితే దీనిపై రోహిత్ స్వయంగా క్లారిటీ ఇచ్చాడు. త్వరలో ప్రారంభం కానున్న రంజీ ట్రోఫీ గ్రూప్ మ్యాచ్‌ల్లో తాను బరిలో దిగుతున్నట్లు చెప్పి సస్పెన్స్‌కు తెర దించాడు.
ఛాంపియన్స్ ట్రోఫీ జట్టు ప్రకటన కోసం బీసీసీఐ ముంబయిలో ఏర్పాటు చేసిన మీటింగ్‌లో రోహిత్ పాల్గొన్నాడు. జట్టు ప్రకటన అనంతరం రంజీలో ఆడే విషయంపై స్పష్టతనిచ్చాడు. 'మీరు రంజీలో ఆడుతున్నారా?' అన్న ప్రశ్నకు రోహిత్ 'యస్ రంజీలో ఆడనున్నాను' అని రిప్లై ఇచ్చాడు. టోర్నీలో ముంబయి తరఫున రోహిత్ ప్రాతినిధ్యం వహించనున్నాడు.
ఆ సిరీస్ కంటే ముందే
ఈ నెల 23న కశ్మీర్ జట్టుతో ముంబయి మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లోనే రోహిత్ బరిలో దిగే ఛాన్స్ ఉంది. దీంతో ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్ కంటే ముందే రోహిత్ బ్యాటింగ్ చూడవచ్చు. ఈ సిరీస్‌కు రంజీ మ్యాచ్ ప్రాక్టీస్లాగానూ రోహిత్‌కు ఉపయోగపడుతుంది. ఫిబ్రవరి 6న ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్ ప్రారంభం కానుంది.