ICC Men Player of Month Bumrah :ఆస్ట్రేలియా పర్యటనలో భారత స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా అద్భుతమైన ప్రదర్శనకు 'ప్లేయర్ ఆఫ్ ది మంత్'గా ఎంపికయ్యాడు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ మంగళవారం ప్రకటించిన ఫలితాల్లో పురషుల విభాగంలో బుమ్రా ఈ అవార్డ్‌ను గెలుచుకున్నాడు. ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌ను వెనక్కి నెట్టి మరీ బుమ్రా బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డ్‌ను అందుకున్నాడు.
ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో బుమ్రా అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడు. గతేడాది డిసెంబర్లో జరిగిన మూడు టెస్ట్‌ల్లో 14.22 సగటు రేటులో 22 వికెట్లు సాధించాడు. తరువాత జరిగిన నాలుగు, ఐదు మ్యాచ్‌ల్లో తొమ్మిది వికెట్లు తీశాడు. అదే సమయంలో అత్యధిక రేటింగ్ పాయింట్స్ సాధించిన భారత బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. మరోవైపు ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో అద్భుతంగా రాణించాడు. అయితే సిడ్నీలో జరిగిన చివరి టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో వెన్ను నొప్పితో బౌలింగ్‌కు దూరం అయ్యాడు. ఈ సిరీస్‌లో బుమ్రా మొత్తం 32 వికెట్లు తీశాడు. దీంతో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‌ను దక్కించుకున్నాడు. ఈ అద్భుతమై ప్రదర్శనతో బుమ్రా ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్‌గా నిలిచాడు.