Dom Joyce and Ed Joyce Cricket Career : క్రికెట్‌లో అవకాశాలు అందుకోవడం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకోవడం చాలా కష్టం. కొంత మందికే ఈ ఛాన్స్ దక్కుతుంది. అలాంటిది ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అంతర్జాతీయ క్రికెట్ ఆడే అవకాశం దక్కించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు ఇయాన్ చాపెల్, గ్రెగ్ చాపెల్, స్టీవ్ వా, మార్క్ వా, ఆండీ ఫ్లవర్, గ్రాంట్ ఫ్లవర్, మన ఇర్ఫాన్ పఠాన్, యూసుఫ్ పఠాన్ ఈ కోవకే చెందుతారు.
వీళ్లంతా వేర్వేరు సమయాల్లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశారు. కానీ ఓ అన్నదమ్ముల జోడీ మాత్రం ఒకే మ్యాచ్‌తో కెరీర్ ప్రారంభించింది. 2006లో ఎడ్ జాయిస్, డోమ్ జాయిస్ కలిసి వన్డే అరంగేట్రం చేశారు. కానీ ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. వాళ్లు ఒకే టీమ్ తరఫున ఆడలేదు. ఇద్దరూ ప్రత్యర్థులు.
డోమ్ ఐర్లాండ్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఎడ్ ఇంగ్లండ్ తరఫున బరిలో దిగాడు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 38 పరుగుల తేడాతో మ్యాచ్ గెలిచింది. అయితే అరంగేట్రం మ్యాచ్ అన్నదమ్ములు ఇద్దరికీ అంత ప్రత్యేకంగా నిలవలేదు. ఎడ్ కేవలం 10 పరుగులు మాత్రమే చేశాడు. డోమ్ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. ఆ తర్వాత డోమ్ మరో రెండు వన్డేలు మాత్రమే ఆడాడు. అతడు చివరిసారి 2007లో దక్షిణాఫ్రికాపై ఆడాడు. ఐర్లాండ్ తరఫున ఎడ్ అంతర్జాతీయ కెరీర్ 2018లో ముగిసింది. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లలో ఎడ్ మంచి రికార్డుతో కెరీర్ ముగించాడు.