Border - Gavaskr Trophy 2024 Shubman Gill Injury Update : బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదికగా ఆస్ట్రేలియా - భారత్ జట్ల మధ్య తొలి టెస్టు మొదలైంది. టీమ్‌ఇండియా టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగింది. తుది జట్టులో కొత్త కుర్రాళ్లైన నితీశ్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణాకు చోటు దక్కింది.
ఆసీస్‌తో మొదలైన తొలి టెస్ట్ - గిల్ గాయంపై బీసీసీఐ అప్డేట్ - SHUBMAN GILL INJURY UPDATE
పెర్త్ వేదికగా మొదలైన బోర్డర్ గావస్కర్ ట్రోఫీ తొలి టెస్ట్ - గిల్ గాయంపై అప్డేట్ ఇచ్చిన బీసీసీఐ.
Published : Nov 22, 2024, 9:29 AM IST
అయితే రీసెంట్గా గిల్‌కు గాయమైన సంగతి తెలిసిందే. అతడు వేలికి అయిన గాయం నుంచి కోలుకుని తొలి టెస్ట్ ఆడతాడని అంతా భావించారు. కానీ అది జరగలేదు. టీమ్ మేనేజ్మెంట్ అతడికి రెస్ట్ ఇచ్చింది. దీంతో అతడి గాయం తీవ్రతపై ప్రస్తుతం క్రికెట్ అభిమానుల్లో కాస్త ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో బీసీసీఐ గిల్ గాయం గురించి అప్డేట్ ఇచ్చింది.
"శుభ్‌మన్ గిల్ వేలికి గాయం అయింది. వాకాలో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో గాయపడ్డాడు. పూర్తిగా అతడు కోలుకోకపోవడం వల్ల మొదటి టెస్టుకు సెలక్ట్ చేయలేదు. బీసీసీఐ మెడికల్ టీమ్ నిరంతరం అతడి పరిస్థితిని గమనిస్తూనే ఉంది" అని బీసీసీఐ తెలిపింది.