Bhuvneshwar Kumar Sunrisers :టీమ్ఇండియా స్టార్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ సన్‌రైజర్స్‌తో ఉన్న 11ఏళ్ల అనుబంధానికి ముగింపు పలుకుతూ ఎమోషనల్ అయ్యాడు. సన్‌రైజర్స్ జట్టుతో ఎన్నో మరపురాని జ్ఞాపకాలు ఉన్నాయని పేర్కొన్నాడు. ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ మద్దతు ఓ అద్భుతం అని కొనియాడాడు. ఈ మేరకు గురువారం సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేశాడు.
'11 ఏళ్ల అద్భుత ప్రయాణం తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు గుడ్ బై చెప్పే సమయం వచ్చింది. ఆరెంజ్ ఆర్మీతో నాకు ఎన్నో మరుపురాని జ్ఞాపకాలు ఉన్నాయి. ఇక్కడ ఓ అద్భుతమైన విషయం ఏంటంటే, అభిమానుల ప్రేమ. వాళ్లు ఎల్లప్పడూ నాకు మద్దతుగానే ఉంటూ వచ్చారు. మీ ప్రేమ, మద్దతు ఎప్పటికీ నాతోనే ఉంటుంది' అని భువీ క్యాప్షన్ రాసుకొచ్చాడు. సన్‌రైజర్స్‌తో తన జర్నీలోని అద్భుతమైన క్షణాలను వీడియో ద్వారా షేర్ చేశాడు. దీనికి 'వి మిస్ యూ భువీ' అని సన్‌రైజర్స్ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతుండగా, 'వెల్ కమ్' అంటూ ఆర్సీబీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల ఐపీఎల్ రిటెన్షన్స్‌లో సన్‌రైజర్స్ జట్టు భువీని అట్టిపెట్టుకోలేదు. దీంతో అతడు వేలంలోకి వచ్చాడు. అయితే భువీని ఆర్టీఎమ్ ఉపయోగించి మళ్లీ సన్‌రైజర్స్ ఫ్రాంచైజీనే దక్కించుకుంటుందని ఫ్యాన్స్ భావించారు. కానీ, అలాంటిదేం జరగలేదు. రీసెంట్ వేలంలో రూ.2 కోట్ల బేస్ ప్రైజ్‌తో భువీపై బిడ్డింగ్ ప్రారంభమైంది. ఈ స్వింగ్ కింగ్‌ను దక్కించుకునేందుకు ముంబయి, ఆర్సీబీ జట్లు తీవ్రంగా ప్రయత్నించాయి. కానీ, చివరకు రూ. 10.75 కోట్లకు ఆర్సీబీ కొనుగోలు చేసింది. ఇక సన్‌రైజర్స్ ఆర్టీెఎమ్ ద్వారా భువీని తిరిగి పొందేదుకు ఆసక్తి చూపకపోవడం వల్ల అతడు ఆర్సీబీకి వెళ్లిపోవాల్సి వచ్చింది.