Best Openers In International Cricket :క్రికెట్లో ప్రతి ఆటగాడు కీలకమే. ఓపెనర్ నుంచి 11వ స్థానంలో దిగే బౌలర్ వరకు అందరూ సమష్ఠిగా రాణిస్తేనే జట్టు సునాయాశంగా విజయం సాధిస్తుంది. ఈ క్రమంలో అంతర్జాతీయ కెరీర్ తొలినాళ్లలో మిడిలార్డర్లో బ్యాటింగ్ చేసి ఆ తర్వాత ఓపెనర్లుగా మారి సక్సెస్ అయిన టాప్-3 బ్యాటర్ల గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం.
వీరేంద్ర సెహ్వాగ్ (నజఫ్ గఢ్ నవాబ్)
టీమ్ ఇండియా మాజీ దిగ్గజం వీరేంద్ర సెహ్వాగ్ తన అంతర్జాతీయ కెరీర్‌ను మిడిల్ ఆర్డర్ బ్యాటర్‌గా ప్రారంభించాడు. ఆ తర్వాత కాలంలో ఓపెనర్ స్థానానికి ప్రమోట్ అయ్యాడు. అప్పటి నుంచి అన్ని ఫార్మాట్లలోనూ వెనుదిరిగి చూసుకోకుండా అదరగొట్టాడు. ఇన్నింగ్స్ తొలి బంతి నుంచి దూకుడుగా ఆడేవాడు. దిగ్గజ బౌలర్లకు సైతం చుక్కలు చూపించేవాడు.
ఈ క్రమంలో వీరేంద్ర సెహ్వాగ్ 2004లో జరిగిన టెస్టు మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై ట్రిపుల్ సెంచరీ(309) బాదాడు. అలాగే 2008లో దక్షిణాఫ్రికాపై డబుల్ శతకం (293)తో చెలరేగాడు. టెస్టు మ్యాచ్‌ల్లోనూ వన్డేల్లా దూకుడుగా ఆడేవాడు సెహ్వాగ్. మిడిలార్డర్ నుంచి ఓపెనర్‌గా మారిన తర్వాత క్రికెడ్ లెజెండ్‌గా సెహ్వాగ్ మారాడనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
రోహిత్ శర్మ (హిట్ మ్యాన్)
క్రికెట్ చరిత్రలో అత్యంత నిలకడైన ఓపెనర్లలో టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఒకడు. కెరీర్ తొలినాళ్లలో మిడిలార్డర్లో బ్యాటింగ్ దిగిన హిట్‌మ్యాన్, సొగసైన స్ట్రోక్ ప్లే, దూకుడైన బ్యాటింగ్ శైలితో ఓపెనర్‌గా ప్రమోట్ అయ్యాడు. ఆ తర్వాత రోహిత్ కెరీర్ ఒక్కసారిగా ఊపందుకుంది. వన్డేల్లో ఏకంగా హిట్ మ్యాన్ మూడు డబుల్ సెంచరీలను బాదాడు. అలాగే టెస్టుల్లోనూ అదరగొడుతున్నాడు. ప్రస్తుతం టీ20లకు గుడ్ బై చెప్పిన రోహిత్, టీమ్ ఇండియాకు వన్డే, టెస్టు ఫార్మాట్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.
బ్రెండన్ మెక్ కల్లమ్ (ది బజ్)
న్యూజిలాండ్ మాజీ దిగ్గజం బ్రెండన్ మెక్కల్లమ్ కెరీర్ తొలినాళ్లలో మిడిలార్డర్లో బ్యాటింగ్‌కు దిగేవాడు. ఆ తర్వాత ఓపెనర్‌గా అవకాశం దక్కింది. దీంతో మెక్ కల్లమ్ ఆకాశమే హద్దుగా బౌలర్లపై విరుచుకుపడేవాడు. 2015 ప్రపంచ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియాపై కేవలం 73 బంతుల్లో 158 పరుగులు బాదాడు. అంతలా ఓపెనర్‌గా ప్రమోటైన తర్వాత మెక్కల్లమ్ దూకుడును చూపించాడు. కెప్టెన్‌గా ఉన్న సమయంలో కూడా మెక్కల్లమ్ తన దూకుడును తగ్గించలేదు. ప్రస్తుతం బజ్‌బాల్ వ్యూహం సృష్టికర్తగానూ మెక్‌కల్లమ్‌ను పిలుస్తున్నారు.
సింగిల్ బాల్‌కు 286 రన్స్ - పిచ్ మధ్యలో 6కిమీ పరుగు- క్రికెట్లో రేర్ సీన్ - One Ball 286 Runs
అప్పుడు సచిన్ కొలీగ్- ఇప్పుడు ఫేమస్ బిజినెస్‌మ్యాన్- టాలీవుడ్ హీరోయిన్ మరిదే! - Sachin Tendulkar Colleague