తెలంగాణ

telangana

ETV Bharat / sports

2024లో భారీగా పెరిగిన బీసీసీఐ ఆదాయం - ఐపీఎల్‌ వ్యూవర్‌షిప్‌తో రూ.4200 కోట్ల లాభం! - BCCI WEALTH

ప్రస్తుతం బీసీసీఐ వద్ద ఎంత డబ్బు ఉందంటే?

BCCI
BCCI (source Getty Images)

By ETV Bharat Sports Team

Published : 6 hours ago

BCCI WEALTH : ప్రపంచంలో రిచెస్ట్‌ క్రికెట్‌ బోర్డుగా బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇది తమిళనాడు సొసైటీస్ రిజిస్ట్రేషన్ చట్టం, 1975 కింద రిజిస్టర్‌ అయింది. స్థాయికి తగినట్లే ఈ సంవత్సరం బీసీసీఐ బ్యాంక్ బ్యాలెన్స్ దాదాపు రూ.4,200 కోట్లు పెరిగింది. క్రికెట్ బోర్డు మొత్తం సంపాదన ఇప్పుడు ఏకంగా రూ.20,686 కోట్లకు చేరుకుంది. ప్రపంచంలోని అత్యంత సంపన్న స్పోర్ట్‌ ఆర్గనైజేషన్‌లలో ఒకటిగా నిలిచింది.

బీసీసీఐ ప్రధాన ఆదాయ వనరులు

బీసీసీఐకి ఎక్కువ ఆదాయాలు ప్రధానంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) మీడియా హక్కులు, ద్వైపాక్షిక క్రికెట్ హక్కుల (Bilateral cricket rights) నుంచి వస్తుంది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) కూడా భారీ లాభాలు అందిస్తోంది. అదనంగా బీసీసీఐ, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) జనరేట్‌ చేసే ఆదాయంలో ఎక్కువ భాగాన్ని పొందుతుంది. 2022 జూన్‌లో ఐపీఎల్‌ మీడియా హక్కుల ఒప్పందం ద్వారా బీసీసీఐ రూ.48,390 కోట్లు పొందింది. దీంతో సంపాదన మరింత పెరిగింది.

కీలక ఆర్థిక అంశాలు

ఆర్థిక సంవత్సరం 2023లో బీసీసీఐ నగదు, బ్యాంక్ బ్యాలెన్స్ రూ.16,493 కోట్లుగా ఉంది. అంతకుముందు సంవత్సరంలో ఈ మొత్తం రూ.10,991.29 కోట్లు కావడం గమనార్హం. ఇది 2024 ఆర్థిక సంవత్సరానికి రూ.20,686 కోట్లకు పెరిగింది. దాదాపు రూ.4,200 కోట్లు పెరిగింది. అలానే బీసీసీఐ జనరల్‌ ఫండ్‌ కూడా గణనీయమైన పెరుగుదలను చూసింది. రూ.6,365 కోట్ల నుంచి రూ.7,988 కోట్లకు చేరుకుంది.

2023-24 ఆర్థిక సంవత్సరానికి క్రికెట్ బోర్డు రూ.7,476 కోట్లు ఆర్జించవచ్చని అంచనా వేశారు. వాస్తవ ఆదాయం అంచనాలను మించి బీసీసీఐ లాభాలు అందుకుంది. ఏకంగా రూ.8,995 కోట్లు సంపాదించింది.

భవిష్యత్తు అంచనాలు ఎలా ఉన్నాయి?

రాబోయే ఆర్థిక సంవత్సరంలో బీసీసీఐ రూ.2,348 కోట్ల ప్రణాళిక వ్యయంతో రూ.10,054 కోట్లు ఆర్జించే అవకాశం ఉందని అంచనా.

రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్లకు మద్దతు

ఆర్థిక నిధుల కోసం బీసీసీఐపై ఆధారపడే రాష్ట్ర క్రికెట్ యూనిట్లకు కూడా నిధులు కేటాయించారు. రాబోయే సంవత్సరంలో ఈ సంఘాల కోసం మొత్తం రూ.499 కోట్ల బడ్జెట్ కేటాయించనుంది.

త్వరలోనే బీసీసీఐకి కొత్త కార్యదర్శి, కోశాధికారి - ఆ రోజే ఎన్నికలు!

'జహీర్‌, నీ షేడ్స్ కనపడుతున్నాయి' - పల్లెటూరి చిన్నారి బౌలింగ్​కు సచిన్ ఫిదా

ABOUT THE AUTHOR

...view details