Jay Shah ICC Chairman:అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఛైర్మన్‌గా బీసీసీఐ సెక్రటరీ జై షా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ అత్యన్నత పదవికి జై షా మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఐసీసీ అధికారికంగా ప్రకటించింది. ఈ పదవికి కేవలం ఒక్క జై షా నామినేషనే దాఖలైంది. దీంతో ఎలాంటి ఎన్నిక లేకుండానే జై షా క్రికెట్ అత్యున్నత బోర్డుకు ఛైర్మన్ అయ్యారు. 2024 డిసెంబర్ 1న జై షా ఐసీసీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. రెండేళ్లపాటు జై షా ఆ పదవిలో కొనసాగుతారు.
ఇక ఐసీసీ ఛైర్మన్‌గా ఎన్నికైన సందర్భంగా జై షా మాట్లాడారు. 'క్రికెట్‌ను ప్రంపచవ్యాప్తంగా మరింత విస్తరించేందుకు పనిచేస్తాను. ఐసీసీ సభ్య దేశాలతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నా. 2028 లాస్ ఏంజిలెస్ ఒలింపిక్స్‌లో క్రికెట్ నిర్వహించడం అత్యంత ముఖ్యమైన సవాళ్లు, అవకాశాలలో ఇది ఒకటి' అని జై షా అన్నారు. ఇక ప్రస్తుతం జై షా ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) ప్రెసిడెంట్, బీసీసీఐ సెక్రటరీగా కొనసాగుతున్నారు. అయితే ఐసీసీ ఛైర్మన్‌గా ఎన్నికవ్వడం వల్ల ఆయన ఈ రెండు పదవులకు రాజీనామా చేయవలసి ఉంటుంది.
కాగా, ఐసీసీ ప్రస్తుత ఛైర్మన్ జార్జీ బార్క్లే 2020లో తొలిసారి ఆ బాధ్యతలు చేపట్టారు. 2022లో కూడా తిరిగి ఆయనే ఎన్నికయ్యారు. ఇక మూడోసారి ఆ బాధ్యతల్లో కొనసాగేందుకు జార్జీ బార్క్లేకు అర్హత ఉన్నప్పటికీ ఆయన ఆసక్తి చూపలేదు. 2024 నవంబర్‌లో ఆయన పదవీకాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో జై షా ఎన్నిక జరిగింది.