తెలంగాణ

telangana

ETV Bharat / sports

ప్లేయర్స్​కు BCCI నయా రూల్స్​- ఇకపై అవన్నీ బంద్! గంభీర్ రచించిన పది సూత్రాలు ఇవే! - BCCI 10 POINT POLICY

ప్లేయర్స్​పై కఠిన ఆంక్షలు - గంభీర్ రచించిన నయా రూల్స్​ - బీసీసీఐ విడుదల చేసిన 10 సూత్రాలు ఏవంటే?

BCCI 10 Point Policy
BCCI 10 Point Policy (Getty Images, Associated Press)

By ETV Bharat Sports Team

Published : Jan 17, 2025, 7:06 AM IST

BCCI 10 Point Policy : గత మ్యాచ్​ల ఫలితాలను దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ తాజాగా టీమ్ఇండియా ప్లేయర్ల కోసం 10 పాయింట్లతో కూడిన ఓ క్రమశిక్షణ గైడ్​లైన్స్ జారీ చేసింది. వాటిలో దేన్ని ఉల్లంఘించిన కూడా ప్లేయర్లకు ఫైన్స్​ విధించనున్నట్లు తెలుస్తోంది. టీమ్ఇండియా హెడ్​ కోచ్ గౌతమ్‌ గంభీర్‌ ఈ మార్పులకు కావాల్సిందేనని పట్టుబట్టినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఆ రూల్స్​ ఏంటంటే?

బీసీసీఐ తెచ్చిన రూల్స్ ఇవే :

  1. దేశవాళి టోర్నీల్లో ప్లేయర్లు ఆడితేనే వారిని నేషనల్ టీమ్​లోకి తీసుకోవడం, అలాగే సెంట్రల్ కాంట్రాక్ట్‌కు అర్హులుగా పరిగణించనున్నారు.
  2. ప్లేయర్లు తమ ఫ్యామిలీలతో కాకుండా టీమ్​తోనే మ్యాచ్‌లు అలాగే ప్రాక్టీస్‌ సెషన్స్​లో పాల్గొనేందుకు ప్రయాణించాల్సి ఉంటుంది.
  3. ప్లేయర్ల బ్యాగేజ్​పై లిమిట్.
  4. ప్లేయర్లు తమ పర్సనల్ స్టాఫ్​ను( స్టైలిస్ట్స్, పర్సనల్ సెక్యూరిటీ గార్డ్, కుక్) వెంట తీసుకెళ్లాలంటే బీసీసీఐ పర్మీషన్​ తీసుకోవాల్సి ఉంటుంది.
  5. ప్లేయర్లు తమ క్రికెట్ కిట్స్​, ట్రావెల్ బ్యాగ్స్​ను బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌కు మాత్రమే తరలించాలి.
  6. ప్రాక్టీస్ సెషన్‌కు ప్లేయర్లందరూ హాజరు కావాల్సి ఉంటుంది.
  7. ఇంటర్నేషనల్ సిరీస్‌లు ఆడే సమయంలోనూ ప్లేయర్స్ ఎలాంటి యాడ్ షూట్స్​లో పాల్గొనడానికి వీళ్లేదు. కేవలం క్రికెట్‌పై మాత్రమే ఫోకస్ చేయాల్సి ఉంటుంది.
  8. ఫ్యామిలీ ట్రావెల్ పాలసీని సైతం రూపొందించింది బీసీసీఐ. 45 రోజుల పాటు సిరీస్ ఉంటే కేవలం రెండు వారాలు మాత్రమే ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేసేందుకు అవకాశం కల్పించనున్నారు.
  9. ప్లేయర్లంతా బీసీసీఐ ప్రమోషనల్ యాక్టివిటీస్‌లో పాల్గొనాల్సి ఉంటుంది.
  10. సిరీస్ అయ్యేంతవరకూ ప్లేయర్లందరూ టీమ్​తోనే ఉండాల్సి ఉంటుంది. ఒక వేళ అనుకున్న సమాయానికి ముందుగానే మ్యాచ్ అయిపోయినా కూడా జట్టుతో ఉండటం ద్వారా యూనిటీ పెరుగుతుందని బీసీసీఐ అభిప్రాయం.

ABOUT THE AUTHOR

...view details