BALAKRISHNA CHANDRABABU UNSTOPPABLE 4 PROMO : ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న టాక్ షో అన్‌స్టాపబుల్ సీజన్-4 అక్టోబర్ 25 నుంచి ప్రారంభం కానుంది. ఈ మధ్యే ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుతో మొదటి ఎపిసోడ్‌ను షూట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ షోకు సంబంధించి రీసెంట్‌గానే షూటింగ్ కూడా పూర్తైంది. తాజాగా ఈ ఎపిషోడ్‌కు సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ప్రోమో సుమారు 5 నిమిషాల 30 సెకండ్ల పాటు సాగింది. బాలయ్య, చంద్రబాబు మధ్య కాస్త సరదాగా, కాస్త సీరియస్‌గా సంభాషణలు సాగాయి.
ఈ షోలో బాలయ్య కొంతమంది ప్రముఖుల ఫొటోలను తెరపై చూపిస్తూ వీరిలో ఎవరంటే మీకు ఇష్టం అంటూ చంద్రబాబును ప్రశ్నలు వేశారు. ఈ క్రమంలోనే క్రీడారంగానికి చెందిన క్రికెట్ దిగ్గజాలు మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ ఫొటోలను చూపిస్తూ, బావ మీరేమో ధోనీ లాంటి లీడర్, నేనేమో విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్ - మరి మీరు ఆ ఇద్దరిలో ఎవరంటే ఇష్టం అని బాలయ్య చంద్రబాబును అడిగారు.
దీనికి చంద్రబాబు సమాధానమిస్తూ "నేను ఎప్పుడూ విరాట్ కోహ్లీని ఇష్టపడతాన'ని పేర్కొన్నారు. తాజాగా రిలీజైన ఈ ప్రోమో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పూర్తి ఎపిసోడ్ అక్టోబర్ 25 రాత్రి 8.30 గంటలకు ఆహాలో స్ట్రీమ్ కానుంది. అప్పటి వరకు ఈ ప్రోమోను మీరు చూసేయండి.