తెలంగాణ

telangana

ETV Bharat / sports

అమ్మాయిలు భళా! - బ్యాడ్మింటన్ ఆసియా ఛాంపియన్​షిప్​లో తొలి స్వర్ణం - ఆసియా ఛాంపియన్​షిప్ 2024 విన్నర్

Badminton Asia Team Championship 2024 : మలేషియాలో జరిగిన ఆసియా టీమ్‌ ఛాంపియన్‌షిప్​లో టీమ్​ఇండియా చరిత్ర సృష్టించింది. ఆదివారం జరిగిన ఫైనల్స్​లో థాయ్‌లాండ్‌పై 3-2 తేడాతో భారత మహిళల జట్టు గెలుపొందింది

Badminton Asia Team Championships Winner
Badminton Asia Team Championships Winner

By ETV Bharat Telugu Team

Published : Feb 18, 2024, 12:12 PM IST

Updated : Feb 18, 2024, 2:03 PM IST

Badminton Asia Team Championship 2024 : మలేషియాలో జరిగిన ఆసియా టీమ్‌ ఛాంపియన్‌షిప్​లో టీమ్​ఇండియా చరిత్ర సృష్టించింది. ఆదివారం జరిగిన ఫైనల్స్​లో థాయ్‌లాండ్‌పై 3-2 తేడాతో భారత మహిళల జట్టు గెలుపొందింది. ఈ నేపథ్యంలో బ్యాడ్మింటన్ ఆసియా టీమ్ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను గెలుచుకుని తొలి స్వర్ణాన్ని తన ఖాతాలో వేసుకుంది. రెండు సింగిల్స్‌, ఒక డబుల్‌ మ్యాచ్‌లో మన ప్లేయర్లు విజయాన్ని సాధించారు. గాయత్రీ గోపిచంద్-త్రిశా జోలీ జోడీ, పీవీ సింధు, అన్‌మోల్‌ ఖర్బ్‌ తమ మ్యాచుల్లో గెలిచారు. అంతకుముందు జరిగిన సెమీఫైనల్లోనూ సత్తా చాటిన టీమ్ఇండియా జ‌పాన్ ప్లేయర్లను చిత్తుచేశారు. అలా బ్యాడ్మింట‌న్ ఆసియా టీమ్ ఛాంపియ‌న్‌షిప్స్ టోర్నీలో తొలిసారిగా ఫైన‌ల్​లో అడ‌గుపెట్టి రికార్డుకెక్కారు.

ఫైనల్స్ సాగిందిలా
Badminton Asia Team Championship Finals : భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఫైనల్‌లో తన ఆటతీరుతో అదరగొట్టేసింది. గాయం కారణంగా సుదీర్ఘ విరామం తర్వాత బ్యాడ్మింటన్ ఆసియా టీమ్ ఛాంపియన్​షిప్స్​ 2024 టోర్నమెంట్​తో అదిరిపోయే కమ్​బ్యాక్ ఇచ్చింది భారత స్టార్ షట్లర్ పీవీ సింధు. ఫైనల్​లో కేవలం 39 నిమిషాల్లోనే థాయ్‌లాండ్‌కు చెందిన సుపనిద కతేతోంగ్‌పై 21-12, 21-12 తేడాతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో భారత్‌ ఆధిక్యం 1-0కి చేరుకుంది. ఆ తర్వాత రెండో మ్యాచ్‌లో గాయత్రీ గోపిచంద్‌-జోలీ త్రిశా జోడీ కూడా అద్భుతంగా పోరాడింది. థాయ్‌ షట్లర్లు కితిథరకుల్‌-రవ్విందాపై 21-16, 18-21, 21-16 తేడాతో గెలుపొందింది. దీంతో టీమ్‌ఇండియా లీడ్‌ 2-0తో దూసుకెళ్లింది.

అయితే, మూడో మ్యాచ్‌లో అష్మితా చలిహాకు ఓటమి ఎదురైంది. బుసనన్‌ చేతిలో 11-21, 14-21 తేడాతో ఆమె ఓడింది. ఆ తర్వాత మరొక డబుల్స్‌ మ్యాచ్‌నూ టీమ్‌ఇండియా కోల్పోయింది. శ్రుతి - ప్రియా జోడీ 11-21, 9-21తో ఓటమిపాలైంది. అయితే చివరి నిర్ణయాత్మక మ్యాచ్‌లో అన్‌మోల్‌ అదరగొట్టేసింది. 45వ ర్యాంకర్‌ పోర్న్‌పిచా చోయికీవాంగ్‌పై 21-14, 21-9 తేడాతో ఘన విజయం సాధించింది. అలా భారత్‌కు స్వర్ణం అందించింది.

హాంగ్​కాంగ్​ను​ చిత్తు చేసి సెమీస్​లోకి ఎంట్రీ - తొలి పతకాన్ని ముద్దాడనున్న భారత్

ఆసియా బ్యాడ్మింటన్​లో సింధు అదుర్స్- 3-2 తేడాతో చైనాపై భారత్ విక్టరీ

Last Updated : Feb 18, 2024, 2:03 PM IST

ABOUT THE AUTHOR

...view details