Australia Women vs South Africa Women : కొన్ని సార్లు క్రికెట్లో పలు అరుదైన ఘటనలు జరుగుతుంటాయి. అందులో కొన్ని నవ్వులు పూయ్యించేలా ఉండగా, మరికొన్ని మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. తాజాగా ఆస్ట్రేలియా-సౌతాఫ్రికా మహిళల మూడో వన్డేలో ఇటువంటి ఓ ఆసక్తికర ఘటన జరిగింది. అదేంటంటే.
ఒక బాల్ మూడు గోల్స్
అయితే శనివారం జరిగిన ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో ఒకే బంతికి నో బాల్, హిట్ వికెట్, సిక్సర్ పడింది. 48వ ఓవర్ ఆఖరి బంతిని సౌతాఫ్రికా పేసర్ క్లాస్ నో బాల్‌గా వేయగా ఇది జరిగింది. తొలుత ఆ నో బాల్‌ను అలన కింగ్ భారీ షాట్ కొట్టేందుకు యత్నించింది. అయితే ఈ క్రమంలో ఆమె అదుపుతప్పి కిందపడగా, అక్కడే ఉన్న వికెట్లకు బ్యాటు తాకించి హిట్ వికెట్ అయ్యింది. ఇదంతా జరగుతుండగా, అదే బంతి సిక్సర్‌గా మారింది. అయితే దీన్ని అంపైర్ నో బాల్‌గా ప్రకటించడం వల్ల అలన ఔటవ్వడం నుంచి తప్పించుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.