తెలంగాణ

telangana

ETV Bharat / sports

భారత్- ఆస్ట్రేలియా : కష్టాల్లో టీమ్ఇండియా- వాళ్లపైనే ఆశలు! - IND VS AUS 2ND TEST 2024

భారత్- ఆస్ట్రేలియా- ముగిసిన రెండో రోజు ఆట- కష్టాల్లో టీమ్ఇండియా!

Australia vs India
Australia vs India (Source : AP)

By ETV Bharat Sports Team

Published : Dec 7, 2024, 5:22 PM IST

Ind vs Aus 2nd Test:భారత్- ఆస్ట్రేలియా ఆడిలైడ్ టెస్టులో రెండో రోజు ఆట ముగిసింది. రెండో ఆట పూర్తయ్యే సమయానికి టీమ్ఇండియా 29 పరుగుల వెనుకంజలో ఉంది. ప్రస్తుతం భారత్ స్కోర్ 128-5. క్రీజులో నితీశ్ కుమార్ రెడ్డి (15 పరుగులు), రిషభ్ పంత్ (28 పరుగులు) ఉన్నారు. ఆస్ట్రేలియా బౌలర్లలో స్కాట్ బొలాండ్, ప్యాట్ కమిన్స్ చెరో 2, మిచెల్ స్టార్క్ వికెట్ దక్కించుకున్నారు. ఇక మూడో రోజు తొలి రెండు సెషన్స్​లో పంత్, నితీశ్ రాణించాల్సిన అవసరం ఉంది. లేదంటే మ్యాచ్ ఓడిపోయే ప్రమాదం ఉంటుంది.

157 పరుగుల లోటుతో టీమ్ఇండియా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఓపెనర్ కే ఎల్ రాహుల్ (7 పరుగులు) నాలుగో ఓవర్లోనే పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత యశస్వీ జైస్వాల్ (24 పరుగులు) బొలాండ్​కు చిక్కాడు. ఇక భారీ అంచనాలుతో వచ్చిన విరాట్ కోహ్లీ (11 పరుగులు) మరోసారి నిరాశ పర్చాడు. మరో యంగ్ బ్యాటర్ శుభ్​మన్ గిల్ (28 పరుగులు) వేగంగా ఆడే క్రమంలో వికెట్ సమర్పించుకున్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మ కూడా మరోసారి విఫలమయ్యాడు. 6 పరుగులకే పెలివియన్ చేరాడు.

అంతకుముందు ఆసీస్ తొలి ఇన్నింగ్స్​లో 337 పరుగులకు ఆలౌటైంది. ఓవర్​నైట్ స్కోర్ 86-1తో ప్రారంభించిన ఆసీస్ మరో 251 పరుగుల జోడించింది. స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ (140 పరుగులు) భారీ శతకంతో అదరగొట్టాడు. మార్నస్ లబుషేన్ (64 పరుగులు) హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. భారత్ బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ చెరో 4, నితీశ్ రెడ్డి, అశ్విన్ తలో 1 వికెట్ దక్కించుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details