తెలంగాణ

telangana

ETV Bharat / sports

యాషెస్ కంటే బోర్డర్ - గావస్కర్ ట్రోఫీనే తోప్ : ఆస్ట్రేలియా PM - BORDER GAVASKAR TROPHY 2024

టీమ్ఇండియా ప్లేయర్లలో ఆసీస్ ప్రధాని- యాషెస్ కంటే బోర్డర్ గావస్కర్ ట్రోఫీనే పెద్దదన్న పీఎం

Border Gavaskar Trophy
Border Gavaskar Trophy (Source: Associated Press)

By ETV Bharat Sports Team

Published : Nov 30, 2024, 3:44 PM IST

Ashes vs Border Gavaskar Trophy :బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో రెండో టెస్టుకు ముందు ఆసీస్ ప్రైమ్‌మినిస్టర్స్‌ XIతో భారత్ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడేందుకు రెడీ అయ్యింది. ఈ నేపథ్యంలో భారత క్రికెటర్లను ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని ఆల్బనీస్‌ కలిశారు. భారత్‌- ఆసీస్‌ ప్రైమ్‌మినిస్టర్స్‌ జట్లతో మరోసారి ఫొటోలు దిగి, వారితో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా ప్లేయర్లను ఉద్దేశించి ప్రధాని అల్బనీస్ ప్రసంగించారు.

యాషెస్ సిరీస్​ కంటే బోర్డర్- గావస్కర్ ట్రోఫీనే పెద్దదని అల్బనీస్ అన్నారు. ప్రపంచ క్రికెట్‌లో భారత్ -ఆసీస్‌ (AUS vs IND) పోరే అతి పెద్దది అని వ్యాఖ్యానించారు. యాషెస్ సిరీస్‌ (The Ashes) ను తలదన్నేలా ఈ పోరు ఉంటుందని అన్నారు. ఇక 1992 తర్వాత భారత్ ఆసీస్‌ ఐదు టెస్టుల సిరీస్‌ను తొలిసారి ఆడటం బాగుందని పేర్కొన్నారు.

'క్రికెట్‌ చూసే వారి సంఖ్య ఇప్పుడు బాగా పెరిగింది. ఐపీఎల్‌ కూడా మెగా లీగ్‌గా మారిపోయింది. ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి నేనూ అహ్మదాబాద్‌ స్టేడియంలో వన్డే ఫైనల్​ మ్యాచ్‌ను చూశాను. టెస్టులను చూసేందుకు కూడా ఇప్పుడు ప్రేక్షకులు భారీగా స్టేడియాలకు వస్తున్నారు. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లోనూ భారత్- ఆసీస్ జట్లు తలపడ్డాయి. అప్పుడు లండన్‌లో మేం విజయం సాధించాం. కానీ, సిరీస్‌ల్లో మాత్రం ఇరు జట్ల మధ్య పోరాటం నువ్వా నేనా అన్నట్లుగా ఉంది. గతంలో మూడు మ్యాచ్​ల సిరీస్‌ మాత్రమే ఎక్కువగా జరిగేది. ఇప్పుడు సిరీస్​లో ఐదు టెస్టులు జరగనుండటం అనందంగా ఉంది. బాక్సింగ్‌ డే టెస్టు (డిసెంబర్ 26) మ్యాచ్ కోసం కనీసం లక్ష మంది వస్తారని అనుకుంటున్నా. ఇలా కూడా ఆస్ట్రేలియా పర్యటక రంగం బాగుంటుంది' అని ఆల్బనీస్‌ తెలిపారు

టీమ్ఇండియాకు నిరాశే
ఈ సిరీస్​లో భారత్​ డిసెంబర్ 6 నుంచి రెండో టెస్టు ఆడనుంది. ఈ మ్యాచ్​కు ఆడిలైడ్ వేదిక కానుంది. అది డే/నైట్ టెస్టు కావడం విశేషం. అయితే ఆ పింక్ బాల్ టెస్టుకు ప్రాక్టీస్​గా ప్రైమ్‌మినిస్టర్స్‌ XIతో భారత్ వార్మప్‌ మ్యాచ్‌కు సిద్ధమైంది. కాన్‌బెర్రా వేదికగా ఈ మ్యాచ్‌ శని, ఆదివారాల్లో జరగాల్సి ఉంది. కానీ, వర్షం కారణంగా శనివారం ఆట పూర్తిగా రద్దైంది. కనీసం టాస్‌ కూడా వేయలేని పరిస్థితి ఏర్పడడం గమనార్హం. ఇక రెండో రోజు (ఆదివారం) ఆటైనా సాధ్యపడుతుందో? లేదో చూడాలి.

పార్లమెంట్​లో రోహిత్ అదిరే స్పీచ్- కెప్టెన్​ శ్వాగ్ వీడియో చూశారా?

పేసర్ మహ్మద్ షమీకి మళ్లీ గాయమా? - ఆసీస్​ సిరీస్​కు కష్టమే!

ABOUT THE AUTHOR

...view details