Asia Team Championship Finals : భారత బ్యాడ్మింటన్ మహిళా జట్టు ఇటీవలే ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఆసియా టీమ్ ఛాంపియన్‌షిప్ చరిత్రలో తొలిసారి ఫైనల్‌కు చేరుకుంది. సెమీస్‌లో జపాన్‌పై 3-2 తేడాతో గెలిచింది. హోరా హోరీగా జరగిన ఈ టోర్నీలో తొలుత జపాన్ ఆధిపత్యం చూపించింది. అయితే భారత షట్లర్ పీవీ సింధును 13-21, 20-22 తేడాతో ఓడిచిన అయా ఒహోరి జపాన్ స్కోర్‌ను 1-0 ఆధిక్యంలోకి తీసుకెళ్లింది.
ఆ తర్వాత రెండో మ్యాచ్‌లో భారత యంగ్ ప్లేయర్స్ త్రిసా-గాయత్రీ గోపిచంద్ అద్భుత పోరాటం వల్ల నమీ మత్సుయమ-చిహారు షిద పై 21-17, 16-21, 22-20 తేడాతో ఘన విజయాన్ని సాధించారు. దీంతో ఇరు జట్లూ 1-1తో సమంగా నిలిచాయి. మరో మ్యాచ్‌లో నొజోమి ఒకుహర తన ఛాంపియన్ గేమ్‌తో జపాన్‌ను మళ్లీ ఆధిక్యంలోకి వచ్చేలా చేసింది. అష్మితాపై 21-17, 21-14 తేడాతో ఒకుహర విజయాన్నిసొంతం చేసుకుంది. దీంతో జపాన్ 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది.
ఇక మిగిలిన రెండు రౌండ్లలో గెలిస్తేనే భారత్ ఫైనల్‌కు చేరుకుంటుంది. అలాంటి సమయంలో అశ్విని పొన్నప్పతో కలసి పీవీ సింధు ప్రపంచంలోనే నంబర్ 11స్థానంలో ఉన్న జోడీ మియుర- అయకో సుకురమోటోపై 21-14, 21-11తో గెలుపొందింది. దీంతో భారత్-జపాన్ 2-2తో సమంగా నిలిచాయి.