Ashwin Father About His Retirement :టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ అన్ని అంతర్జాతీయ ఫార్మాట్లకు వీడ్కోలు పలికి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ముఖ్యంగా ఆస్ట్రేలియా టూర్ ముగియకుండానే అతడు తీసుకున్న ఈ అనూహ్య నిర్ణయం ఎందరినో ఆందోళనకు గురి చేసింది. అయితే తాజాగా అశ్విన్ రిటైర్మెంట్‌పై తన తండ్రి చేసిన సంచలన వ్యాఖ్యలు నెట్టింట తీవ్ర దుమారం రేపుతోంది. వాళ్లు వేధించడం వల్లనే తన కుమారుడు టీమ్ నుంచి తప్పుకున్నాడని ఆయన అన్నారు. వాళ్లు పెట్టిన స్ట్రెస్ వల్లే ఇదంతా జరిగిందని చెప్పారు.
"అశ్విన్ రిటైర్మెంట్ గురించి నాకు లాస్ట్ మినిట్‌లోనే తెలిసింది. తన మైండ్‌లో ఏం నడుస్తోందో నాకు అస్సలు తెలియదు. తను ఇలా రిటైర్ అవ్వడం నాకు అస్సలు ఇష్టం లేదు. కానీ అశ్విన్ నిర్ణయాన్ని ఒప్పుకోక తప్పలేదు. ఎంతో ఒత్తిడి మధ్య నేను ఈ విషయాన్ని ఒప్పుకోవాల్సి వచ్చింది. అందుకు నేనేమీ బాధపడట్లేదు. కానీ అతడు రిటైర్మెంట్ గురించి ప్రకటించిన తీరుపై ఒకింత సంతోషం కలిగినా, మరింత ఎక్కువగా బాధే ఉంది. ఎందుకంటే అతడు ఇంకొన్నేళ్ల పాటు ఆటలో కొనసాగాల్సింది. రిటైర్ అవ్వాలని అతడు అనుకుంటే నేను ఏమీ చేయలేను. కానీ అతడు నిర్ణయాన్ని ప్రకటించిన తీరు బాలేదు. ఎక్కడో ఏదో జరిగింది" అని అశ్విన్ తండ్రి రవిచంద్రన్ అనుమానాలు వ్యక్తం చేశాడు.
చెన్నైకి చేరుకున్న అశ్విన్- ఇంటి వద్ద గ్రాండ్ వెల్కమ్
Ravichandran Ashwin Welcome :క్రికెట్‌కు వీడ్కోలు ప్రకటించిన తర్వాత తొలిసారి ఇంటికి వచ్చిన రవిచంద్రన్ అశ్విన్‌కు కుటుంబ సభ్యులు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. రిటైర్మెంట్ ప్రకటన తర్వాత ఆస్ట్రేలియా నుంచి బుధవారం బయల్దేరిన అశ్విన్ గురువారం ఉదయానికి చెన్నైలోని తన ఇంటికి చేరుకున్నాడు. అక్కడ అతడికి ఘన స్వాగతం లభించింది. బ్యాండ్ చప్పుళ్లు, కోలాహాలంతో అశ్విన్‌కు ఫ్యామిలీ మెంబర్స్, ఫ్యాన్స్, కాలనీ వాసులు లెజెండరీ క్రికెటర్‌కు పూలు చల్లుతూ స్వాగతం పలికారు. గెటు వద్దకు వెళ్లగానే తన తండ్రి భావోద్వేగంతో అశ్విన్‌ను హత్తుకున్నారు. కుటుంబ సభ్యులు కూడా ఎమోషనల్ అయ్యారు. అశ్విన్ రాకతో కాలనీ మొత్తం సందడిగా మారింది.
ఇంటి వద్ద అశ్విన్ మీడియాతో మాట్లాడాడు. స్థానికుల కోరిక మేరకు తన మాతృభాష తమిళంలోనే మాట్లాడాడు. 'నేను చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడనున్నాను. ఇంకొన్నేళ్లపాటు చెన్నై తరఫున ఆడాలని అనుకున్నా మీరు ఆశ్చర్యపోకండి. ఓ క్రికెటర్‌గా అశ్విన్ అలసిపోలేదు. కానీ, భారత క్రికెటర్‌గా ఆ నిర్ణయం తీసుకునే సమయం వచ్చింది అంతే' అని అన్నాడు. ఇక రిటైర్మెంట్ ప్రకటించడం కష్టంగా అనిపించిందా? అన్న ప్రశ్నకు బదులిచ్చాడు. 'అలా కాదు. ఈ నిర్ణయం అనేక మందికి ఓ భావోద్వేగ సందర్భం. కానీ, నాకు ఇది సంతృప్తినిచ్చింది. ఎప్పట్నుంచో నాకు ఈ ఆలోచనలో ఉంది. గబ్బా టెస్టు సమయంలో నాలుగో రోజు అనిపించింది, ఐదో రోజు ప్రకటించా' అని అశ్విన్ తెలిపాడు.
'బ్యాటర్‌గా ఎంట్రీ ఇచ్చి- 500 వికెట్లతో టాప్ 2బౌలర్‌గా ఎదిగాడు'- అశ్విన్ జర్నీపై మాజీ క్రికెటర్
బీసీసీఐ గ్రేడ్ A ప్లేయర్ - ఆ ఘనత సాధించిన 11వ ఆల్‌రౌండర్! - అశ్విన్ నెట్‌వర్త్ గురించి తెలుసా?