తెలంగాణ

telangana

ETV Bharat / sports

గ్రాండ్​గా అనుష్క బర్త్​డే సెలబ్రేషన్స్ - మ్యాక్సీ, ఫాఫ్​ సందడి - Anushka Sharma Birthday Party - ANUSHKA SHARMA BIRTHDAY PARTY

Anushka Sharma Birthday Celebrations : బాలీవుడ్ స్టార్ హీరోయిన్​, స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ బర్త్​డే వేడుకలు గ్రాండ్​గా జరిగాయి. ఆ ఫొటోలు మీ కోసం.

Anushka Sharma Birthday Photos
Anushka Sharma Birthday Photos (Source : ANI)

By ETV Bharat Telugu Team

Published : May 3, 2024, 1:42 PM IST

Anushka Sharma Birthday Celebrations :స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ బర్త్​డే సెలబ్రేషన్స్ గ్రాండ్​గా జరిగాయి. అందులో విరాట్​, అనుష్కతో పాటు ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్​ డుప్లెసిస్, గ్లెన్ మ్యాక్​వెల్​ దంపతులు హాజరై సందడి చేశాడు. బెంగళూరులోని ఓ రెస్టారెంట్​లో అతికొద్దిమంది సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక జరిగనట్లు తెలుస్తోంది. ఇక ఆ మూమెంట్స్​ను సోషల్ మీడియా వేదికగా విరాట్​, అనుష్కతో పాటు డుప్లెసిస్​ కూడా నెట్టింట షేర్ చేశారు.

నువ్వు లేకుంటే నేను లేను
ఇక విరాట్ తాజాగా అనుష్క బర్త్​డే రోజు షేర్ చేసిన పోస్ట్​ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. "నువ్వు లేకపోతే నాకు జీవితమే లేదు. నా జీవితానికి నువ్వు ఓ వెలుగువి. హ్యాపీ బర్త్​డే" అంటూ స్పెషల్ విషెస్ తెలిపాడు. అను
ష్కతో గడిపిన బ్యూటిఫుల్ మూమెంట్స్​కు సంబంధించిన ఫొటోలను షేర్ చేసి ఎమోషనలయ్యాడు.

ఇక స్టార్ క్రికెటర్​గా ఫామ్​లో ఉన్న సమయంలో విరాట్ అనుష్క మధ్య ప్రేమ చిగురించింది. ఓ షాంపూ యాడ్​లో భాగమైన ఈ జంట అప్పటి పరిచయాన్ని క్రమక్రమంగా ప్రేమగా మలుచుకున్నారు. ఆ తర్వాత పెద్దలను ఒప్పించి 2017లో ఇటలీ వేదికగా డెస్టినేషన్ వెడ్డింగ్ ద్వారా విరాట్- అనుష్క​ ఒక్కటయ్యారు. అప్పట్లో ఈ పెళ్లి ట్రెండ్ సెట్​ చేసి అనేక సెలబ్రిటీ పెళ్లిల్లకు థీమ్​గా మారింది. ఇక ఈ జంట 2021లో వామిక అనే పాపకు తల్లిదండ్రులయ్యారు. ఆ తర్వాత ఇప్పుడు 2024లో అకాయ్ అనే కుమారుడికి జన్మనిచ్చారు అనుష్క శర్మ. అయితే ఆమె గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ తన ఫ్యామిలీతో క్వాలిటీ టైమ్​ను స్పెండ్ చేస్తున్నారు.

మరోవైపు విరాట్ ప్రస్తుతం ఐపీఎల్​లో రాణిస్తున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడుతున్న ఈ స్టార్ క్రికెటర్ తన ఆటతీరుతో ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకుంటున్నాడు. బెంగళూరు తన తదుపరి మ్యాచ్​ను గుజరాత్ టైటాన్స్​తో ఆడనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా మే 4న ఈ మ్యాచ్ జరగనుంది.

'మంజ్రేకర్ T20 వరల్డ్​కప్​ టీమ్'- మాజీ క్రికెటర్ జట్టులో విరాట్​కు నో ప్లేస్ - 2024 T20 World Cup

ఫీల్డ్​ అంపైర్​తో గొడవ - కోహ్లీకి గట్టి షాకిచ్చిన ఐపీఎల్ బాసులు! - IPL 2024 RCB VS KKR

ABOUT THE AUTHOR

...view details