Teamindia HeadCoach Gambhir : గౌతమ్ గంభీర్ దూకుడు గురించి క్రికెట్ అభిమానులు అందరికీ తెలిసే ఉంటుంది. ఇటు పర్సనల్ లైఫ్‌లోనూ అటు ప్రొపెషనల్ లైఫ్‌లోనూ ముక్కు సూటిగా ఉంటారు. ముఖ్యంగా తన జట్టు ఆటగాళ్లను ఎవరైనా ఏదైనా అన్నా, తప్పుగా ప్రవర్తించినా ముందు నిలదీసే వ్యక్తి గంభీర్! ఇప్పుడు అతడు భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా బాధ్యతలు స్వీకరించాడు. చాలా మందికి గంభీర్ టీమ్‌ని ఎలా నడిపిస్తాడు? అనే సందేహం ఉంది. ఈ క్రమంలో గంభీర్ టీమ్‌కు ఓ మెసేజ్ ఇచ్చాడు. తన దూకుడు, ఘర్షణలు జట్టుకు ప్రయోజనం కోసమేనని, ప్లేయర్స్ నిజాయితీతో ఆడటంపై దృష్టి పెట్టాలని చెప్పాడు.
గౌతమ్ గంభీర్ మూడు ఫార్మాట్లలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు. 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్ సాధించిన టీమ్‌లో కీలక సభ్యుడు. 2009లో నేపియర్‌లో న్యూజిలాండ్‌పై గంభీర్ చేసిన డబుల్ సెంచరీ బెస్ట్ క్రికెట్ ఇన్నింగ్స్‌లో ఒకటిగా నిలిచిపోతుంది. ప్లేయర్‌గా ఆకట్టుకున్న గంభీర్ ఇప్పుడు కోచ్‌గా తన కెరీర్ ప్రారంభించాడు. వాస్తవానికి అతనికి ఇంతకు ముందు కోచ్‌గా పని చేసిన అనుభవం లేదనే చెప్పాలి. అతనికి ఐపీఎల్‌లో మూడు సంవత్సరాలు మెంటార్‌గా పని చేసిన అనుభవం ఉంది.
నేను దూకుడుగా ఉండేది, ఘర్షణలు పడేది అందుకే : గంభీర్ - Team India Head Coach Gambhir - TEAM INDIA HEAD COACH GAMBHIR
Teamindia HeadCoach Gambhir : భారత జట్టు కోచ్ గంభీర్ తన వైఖరి, అలాగే టీమ్ అవసరాలపై తాజాగా మాట్లాడాడు. టీమ్ ప్రయోజనాలే ముఖ్యమని, వ్యక్తులు కాదని క్లియర్ మెసేజ్ ఇచ్చాడు. ఇంకా అతడు ఏమన్నాడంటే?
![నేను దూకుడుగా ఉండేది, ఘర్షణలు పడేది అందుకే : గంభీర్ - Team India Head Coach Gambhir source IANS](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12-07-2024/1200-675-21933873-0-21933873-1720780191667.jpg)
Published : Jul 12, 2024, 10:21 PM IST
కోచ్‌గా ఎంపికైన తర్వాత త్వరలో శ్రీలంకతో మొదలు కానున్న సిరీస్‌కు గంభీర్ జట్టుతో కలవనున్నాడు. కోచ్‌గా ఇదే అతని మొదటి సిరీస్ కానుంది. అయితే ఇప్పటికీ గంభీర్ సపోర్ట్ స్టాఫ్‌పై బీసీసీఐ నిర్ణయం తీసుకోలేదు. ఇటీవల స్టార్ స్పోర్ట్స్‌లో వీడియోలో గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ, "ఒక ప్లేయర్ బాగాడుతుంటే, క్రికెట్‌లోని మూడు ఫార్మాట్లలో ఆడాలని నమ్ముతాను. ఇంజూరీ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్స్‌పై నమ్మకం లేదు. ప్లేయర్స్ గాయపడుతారు, కోలుకుంటారు అంత వరకే చూడాలి. అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నప్పుడు, ఫామ్‌లో ఉన్నప్పుడు, మూడు ఫార్మాట్‌లు ఆడాలనుకుంటారా? అని ఎవరినైనా అడగండి. వారు రెడ్ బాల్ బౌలర్ లేదా వైట్ బాల్ బౌలర్‌గా లేబుల్ చేయడాన్ని ఇష్టపడరు.’
‘గాయాలు క్రీడాకారుల జీవితంలో భాగం. మీరు మూడు ఫార్మాట్లలో ఆడుతుంటే, గాయపడతారు. తిరిగి వెళ్లి, కోలుకుంటారు. కానీ మీరు మూడు ఫార్మాట్లలో ఆడాలి. ఏ ఫార్మాట్‌కు ఏ ప్లేయర్ సరిపోతాడో గుర్తించడంపై కూడా నాకు నమ్మకం లేదు. ప్లేయర్స్ గాయం, వర్క్‌లోడ్, ఇతర సంబంధిత అంశాలను మేనేజ్ చేయబోతున్నాం. మీరు మీ దేశం కోసం ఆడుతున్నప్పుడు మీకు చాలా తక్కువ వ్యవధి ఉంది. మీరు మంచి ఫామ్‌లో ఉన్నప్పుడు, మూడు ఫార్మాట్‌లను ఆడండి’
‘ప్లేయర్స్‌కి ఓన్లీ మెసేజ్ ఏంటంటే, ప్రయత్నించండి , నిజాయితీతో ఆడండి. మీ వృత్తి పట్ల మీకు వీలైనంత నిజాయితీగా ఉండటానికి ప్రయత్నించండి. ఆటోమేటిక్‌గా ఫలితాలు వస్తాయి. నేను బ్యాట్ పట్టుకుని క్రీజులోకి వచ్చాక, ఫలితాల గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. నేను ఎప్పుడూ అలా అనుకోలేదు. నేను ఎక్కువ పరుగులు చేయబోతున్నాననే ఆలోచనే రాలేదు. నేను నా వృత్తికి వీలైనంత నిజాయితీగా ఉండాలని, కొన్ని విలువలకు కట్టుబడి జీవించాలనే నమ్ముతున్నాను.’
‘ప్రయత్నించండి, సరైన పనులు చేయండి. ప్రపంచం మొత్తం మీకు వ్యతిరేకంగా ఉందని మీరు భావించినప్పటికీ ప్రయత్నించండి. జట్టు ప్రయోజనాల కోసం సరైన పని చేస్తున్నారని మీ హృదయం నమ్ముతుంది. నేను దూకుడుగా ఉన్నా, ఇతరులతో ఘర్షణ పడ్డా, అవన్నీ జట్టుకు మేలు చేసేందుకే. అలా ఉండండి, ఎందుకంటే అంతిమంగా ఇది జట్టు ముఖ్యం, వ్యక్తి కాదు.’
‘ఒక్క విషయం గురించి ఆలోచించండి. మీ జట్టును గెలిపించడానికి ప్రయత్నించండి. మీరు ఏ జట్టు కోసం ఆడినా, టీమ్ స్పోర్ట్స్ డిమాండ్ చేసేది అదే. మీరు మీ గురించి ఆలోచించే వ్యక్తిగత క్రీడ కాదు. ఇది టీమ్ స్పోర్ట్. ఇందులో నేను అనేది చివరిగా వస్తుంది.’ అని గంభీర్ చెప్పాడు.
గంభీర్ సలహా - ఆ పాత్రకు బీసీసీఐ స్వస్తి పలుకుతుందా? - Teamindia Batting Coach
జేమ్స్ అండర్సన్ జర్నీ - ఈ రికార్డులు మరో పేసర్‌కు అసాధ్యమే! - James Anderson Records