Aggressive Cricketers In World :ప్రపంచ క్రికెట్‌లో చాలా మంది స్టార్ ప్లేయర్‌లు ఉన్నారు. కొందరు మిస్టర్ కూల్‌గా పాపులర్ అయితే. మరి కొంత మంది తమ దూకుడుతో ఫ్యాన్స్‌ని ఆకట్టుకున్నారు. అలా మైదానంలో తమ దూకుడుతో పాపులర్ అయిన ఐదుగురు ప్లేయర్‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
వీరేంద్ర సెహ్వాగ్
'నజాఫ్‌గఢ్ నవాబ్'గా పేరొందిన మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ దూకుడు వేరే లెవల్లో ఉంటుంది. మొదటి బంతి నుంచే బాదుడు మొదలుపెడతాడు. ఎదుటి బౌలర్ ఎవరనే దానితో సంబంధం లేకుండా నిర్భయంగా ఆడుతాడు. అతడు పరుగులు చేస్తుంటే బౌలర్లు ప్రేక్షకుల్లా మారిపోతారు. ఈ దూకుడుతోనే క్రికెట్ చరిత్రలో మోస్ట్ ఎంటర్‌టైనింగ్, ఎఫెక్టివ్ ఓపెనర్‌గా సెహ్వాగ్ గుర్తింపు పొందాడు.
విరాట్ కోహ్లి
టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ కోహ్లీ దూకుడు అతడి బ్యాటింగ్‌లోనే కాదు, ఆటలోని ప్రతి అంశంలోనూ కనిపిస్తుంది. ఎప్పుడూ పరుగులు చేయాలనే కసితో ఉండే కోహ్లీ, మొదటి బంతి నుంచే ప్రత్యర్థిపై ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నిస్తాడు. బ్యాటింగ్, ఫీల్డింగ్, కెప్టెన్సీ ఇలా అన్నింట్లో కోహ్లి దూకుడుకు కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేశాడు. ఛేజింగ్‌లో అద్భుతంగా రాణించి, భారత్‌కి అత్యధిక విజయాలు అందించడంతో, కోహ్లి ప్రస్తుత క్రికెట్‌లో అగ్రెస్సివ్ క్రికెట్‌కి ఐకాన్‌గా మారాడు.
క్రిస్ గేల్
క్రిస్ గేల్‌ని క్రికెట్ ప్రపంచంలో 'యూనివర్స్ బాస్'గా పేర్కొంటారు. క్రికెట్‌లో పవర్, దూకుడుకు గేల్ పర్యాయపదం. ఎలాంటి పరిస్థితుల్లోనైనా బంతిని బౌండరీ దాటిస్తాడు. గేల్ తన దూకుడుతో టీ20 క్రికెట్‌లో చాలా విధ్వంసాలు సృష్టించాడు. క్రీజులో గేల్ కుదురుకుంటే, ఇక ప్రత్యర్థి జట్టు తమ వ్యూహాలు మార్చుకోవాల్సిందే.