ICC T20 Rankings :ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో అదరగొట్టిన సన్‌రైజర్స్ హైదరాబాద్ క్రికెటర్ అభిషేక్ శర్మ తాజాగా విడుదలైన ఐసీసీ ర్యాంకుల్లోనూ దూసుకెళ్లాడు. ఏకంగా 38 స్థానాలు ఎగబాకి రెండో స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. తాజాగా జరిగిన ఐదో టీ20లో సెంచరీ సాధించిన ఈ యంగ్ ప్లేయర్, 829 పాయింట్లతో ఈ ర్యాంక్‌కు చేరుకున్నాడు. అయితే టాప్ పొజిషన్లో మాత్రం 855 పాయింట్లతో ఆసీస్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ కొనసాగుతున్నాడు. ఇక తర్వాతి స్థానాల్లో తిలక్ వర్మ (803 పాయింట్లు), ఫిల్ సాల్ట్ (798), సూర్యకుమార్ యాదవ్ (738) ఉన్నారు.
అభిషేక్‌తో పాటు అతడు కూడా
ఇదిలా ఉండగా, తాజాగా 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా' నిలిచిన బౌలర్ వరుణ్ చక్రవర్తి కూడా ఐసీసీ ర్యాంకుల్లో టాప్ పొజిషన్‌కు చేరుకున్నాడు. మూడు స్థానాలను మెరుగుపరుచుకుని మూడో ర్యాంక్‌ను సాధించాడు. అయితే ఈ లిస్ట్‌లో వెస్టిండీస్ బౌలర్ అకీల్ హుసేన్ (707 పాయింట్లు) అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు.
ఇక అదిల్ రషీద్ (705), వరుణ్ చక్రవర్తి (705) పాయింట్ల పరంగా ఒకే పొజిషన్లో ఉన్నప్పటికీ, కొద్దిపాటి తేడాతో రషీద్ రెండు స్థానంలో నిలిచాడు. ఇక 671 పాయింట్లను సాధించిన యంగ్ క్రికెటర్ రవి బిష్ణోయ్ ఈ ర్యాంకింగ్స్‌లో నాలుగు ర్యాంకులను ఎగబాకి ఆరో ప్లేస్‌కు చేరుకున్నాడు.