తెలంగాణ

telangana

ETV Bharat / sports

రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ కోహ్లీ బ్యాచ్ మేట్! - SIDDARTH KAUL RETIREMENT

కెరీర్​కు గుడ్​ బై చెప్పిన టీమ్ఇండియా బౌలర్- అతడు విరాట్ బ్యాచ్ మేటే!

Retirement
Retirement (Source : Getty Images (Left), AP (Right))

By ETV Bharat Sports Team

Published : Nov 28, 2024, 8:23 PM IST

Siddarth Kaul Retirement :టీమ్ఇండియా సీనియర్ పేస్ బౌలర్ సిద్ధార్థ్ కౌల్ షాకింగ్ డెసిషన్ తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్​కు గుడ్​ బై చెప్పేశాడు. తాను రిటైర్మెంట్ పలుకుతున్నట్లు గురువారం సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. అయితే ఇంటర్నేషనల్ క్రికెట్​కు వీడ్కోలు పలికినప్పటికీ, ఓవర్సీస్, డొమెస్టిక్ టోర్నీల్లో కొనసాగనున్నట్లు పేర్కొన్నాడు. ఇక తన కెరీర్​లో మద్దతుగా నిలిచిన బీసీసీఐ, అభిమానులకు కౌల్ కృతజ్ఞతలు తెలిపాడు. ఈ మేరకు ఓ వీడియో షేర్ చేశాడు.

'చిన్నతనంలో పంజాబ్‌ పొలాల్లో క్రికెట్ ఆడేప్పుడు నాకు ఓ కల ఉండేది. నా దేశానికి ప్రాతినిధ్యం వహించడమే నా కల. 2018లో ఆ దేవుడి దయతో టీ20, వన్డేల్లో అరంగేట్రం చేశాను. అప్పుడు టీ20ల్లో నెం 75, వన్డేల్లో నెం 221 క్యాప్​లు అందుకున్నాను. ఇక నా కెరీర్‌కు సమయం కేటాయించి, రిటైర్‌మెంట్‌ ప్రకటించాల్సిన సమయం వచ్చేసింది'

'కెరీర్‌లో కఠిన పరిస్థితుల్లో మద్దతుగా నిలిచిన వారికి కృతజ్ఞతలు చెప్పడానికి నా దగ్గర మాటలు లేవు. నా తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, నా సహచరులు, మద్దతుగా అభిమానులు అందరికీ థాంక్స్. అండర్ 19, టీమ్ఇండియా సీనియర్ జట్టుకు ఆడే ఛాన్స్ ఇచ్చి నా కల నెరవేర్చిన బీసీసీకి ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే ఐపీఎల్​లో కోల్‌కతా నైట్ రైడర్స్, దిల్లీ డేర్‌డెవిల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీలు నాకు జీవితకాల జ్ఞాపకాలను అందించినందుకు థాంక్స్. ఇక 2007లో నా ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేయడానికి, కెరీర్‌లో నాకు ఎల్లప్పుడూ మద్దతుగా నిలిచిన పంజాబ్ క్రికెట్ అసోసియేషన్​కు ప్రత్యేక ధన్యవాదాలు. మీ అందరి మద్దతు లేకపోయి ఉంటే ఈరోజు నేను ఈ స్థాయిలో ఉండే వాడిని కాదు' అని సిద్ధార్థ్ ఎమోషనల్ నోట్ రాసుకొచ్చాడు.

34ఏళ్ల సిద్ధార్థ్ 2018లో టీమ్ఇండియా తరఫున అరంగేట్రం చేశాడు. అయితే 6ఏళ్ల కిందటే అంతర్జాతీయ కెరీర్ ప్రారంభించినప్పటికీ కౌల్​కు ఎక్కువ మ్యాచ్​ల్లో ఆడే ఛాన్స్ రాలేదు. తన కెరీర్​లో ఇప్పటివరకు 3 టీ20, 3 వన్డేల్లోనే టీమ్ఇండియాకు ప్రాతినిధ్యం వహించే అవకాశం వచ్చింది. ఇక కౌల్ అంతర్జాతీయ మ్యాచ్ ఆడి దాదాపు 5ఏళ్లు గడిచిపోయింది. అటు ఐపీఎల్​లోనూ సిద్ధార్థ్ పలు ఫ్రాంచైజీలకు ఆడాడు. కోల్‌కతా నైట్ రైడర్స్, దిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్​ కెరీర్​లో 55 మ్యాచ్​ల్లో కౌల్ 58 వికెట్లు దక్కించుకున్నాడు. 2018 సీజన్​లో సన్​రైజర్స్​ బౌలింగ్​లో కీలక పాత్ర కూడా పోషించాడు.

విరాట్ బ్యాచ్​మేట్
సిద్ధార్థ్​ 2008 అండర్ 19 వరల్డ్​కప్​ విన్నింగ్ జట్టులో సభ్యుడు. అప్పుడు యంగ్ టీమ్ఇండియా విరాట్ కోహ్లీ నాయకత్వంలో ఛాంపియన్​గా నిలిచింది.

టెస్టులకు సౌథీ గుడ్​ బై- WTC ఫైనల్​కు ముందే రిటైర్మెంట్!

రిటైర్మెంట్ ప్రకటించిన మహ్మద్ నబీ- అదే ఆఖరి టోర్నమెంట్ అంట!

ABOUT THE AUTHOR

...view details