తెలంగాణ

telangana

ETV Bharat / sports

భారత్‌లోని ఆ 3 మైదానాల్లో టెస్ట్ సెంచరీ చేయని కోహ్లీ - ఎక్కడంటే?

టెస్ట్ సెంచరీలు చేయడానికి విరాట్​ కోహ్లీకీ కలిసి రాని ఆ మూడు స్టేడియంలు!

source Associated Press
Virat Kohli Century (source Associated Press)

By ETV Bharat Sports Team

Published : Oct 9, 2024, 7:07 PM IST

Virat Kohli Century : టీమ్‌ ఇండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడిగా ఎంతో క్రేజ్ సంపాదించాడు. మూడు ఫార్మాట్‌లలో టాప్‌ ప్లేయర్‌గా రాణించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో తక్కువ సమయంలోనే సెంచరీల రికార్డులు క్రియేట్‌ చేశాడు. వన్డేల్లో సచిన్‌ పేరిట ఉన్న అత్యధిక సెంచరీలను అధిగమించాడు.

అలానే అత్యుత్తమ టెస్ట్ బ్యాటర్​గానూ పేరు సంపాదించాడు. ఇప్పటి వరకు టెస్టుల్లో 29 సెంచరీలు, 30 హాఫ్‌ సెంచరీలు చేశాడు. అయితే విరాట్ పేరిట ఇన్ని సెంచరీలు, రికార్డులు ఉన్నప్పటికీ అతడు కొన్ని మైదానాల్లో మాత్రం విఫలమయ్యాడు.

దేశంలోని కొన్ని ప్రధాన స్టేడియాలలో విరాట్‌ కోహ్లీ ఇంకా టెస్ట్ మ్యాచ్‌లలో మూడు అంకెల మార్కును టచ్​ చేయలేకపోయాడు. సాధారణంగా సొంత గడ్డపై బ్యాటర్లు ఎక్కువగా రాణిస్తుంటారు. విదేశీ పిచ్‌లపై పరుగులు సాధించడానికి కష్టపడుతుంటారు. కానీ కోహ్లీకి భారత్‌లోని మూడు మైదానాలు కలిసి రాలేదు. ఆ మూడు స్టేడియంలలో విరాట్‌కు ఇంకా సెంచరీ చేసే అవకాశం రాలేదు. ఆ మైదానాలు ఏవంటే?

JSCA ఇంటర్నేషనల్ స్టేడియం కాంప్లెక్స్, రాంచీ

రాంచీలోని జేఎస్‌సీఏ స్టేడియంలో విరాట్ కోహ్లీ చాలా కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. అయినా టెస్టుల్లో ఒక్కసారి కూడా సెంచరీ చేయలేకపోయాడు. ఈ మైదానంలో అతడి అత్యధిక స్కోరు 75 మాత్రమే.

పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, మొహాలి

మొహాలీ ఫాస్ట్, బౌన్సీ పిచ్‌కు ప్రత్యేకత. బ్యాటర్లకు సవాలుగా ఉంటుంది. ఈ మైదానంలో టెస్టుల్లో కోహ్లీ అత్యధిక స్కోరు 79. మొహాలీలో కూడా విరాట్‌ వంద సాధించలేకపోయాడు. ఈ పిచ్‌ ఎక్కువగా పేస్ బౌలర్లకు అనుకూలంగా ఉంటుంది. అందుకే కోహ్లీ మంచి ప్రారంభాలను కూడా సెంచరీగా మలచలేకపోయాడు.

నరేంద్ర మోదీ స్టేడియం, అహ్మదాబాద్

ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం అయిన అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం కూడా కోహ్లీకి కలిసి రాలేదు. ఇక్కడ టెస్టుల్లో అతడి అత్యధిక టెస్ట్ స్కోరు కేవలం 44 కావడం గమనార్హం. ఈ భారీ స్టేడియంలో కోహ్లీ ఇంకా టెస్ట్‌ సెంచరీ చేయలేదు.

భారత్ సెమీస్​ గెలిస్తే ఛాంపియన్స్ ట్రోఫీ వేదికల్లో మార్పు! - క్లారిటీ ఇచ్చిన పీసీబీ

టీ20 ర్యాంకింగ్స్​లో అర్షదీప్ రేర్ రికార్డు - టాప్‌-10లోకి ఫస్ట్​టైమ్​!

ABOUT THE AUTHOR

...view details