One Ball 286 Runs :క్రికెట్ హిస్టరీలో చాలా రికార్డులు క్రియేట్ అయ్యాయి. ఎవ్వరికీ సాధ్యం కావనుకున్న రికార్డులను ఆ తర్వాత తరంలో వచ్చిన ప్లేయర్లు కొందరు బద్ధలు కొట్టారు. అద్భుతంగా రాణిస్తే మిగతా రికార్డులు కూడా చెరిగిపోతాయి. కానీ, ఎప్పటికీ బద్ధలుకాని రికార్డు ఒకటుంది? ఆ రికార్డు ఏంటంటే ఫోర్ లేదా సిక్స్ లేకుండా ఒకే బంతికి 286 పరుగులు చేయడం. అదెలా సాధ్యం అనుకుంటున్నారా?
ఒక్క బంతికి 286 పరుగులు
1894 జనవరి 15న విక్టోరియా- స్క్రాచ్ ఎలెవన్ (Victoria - Scratch-XI) జట్టు మధ్య బాన్‌బరీ గ్రౌండ్‌లో ఒక మ్యాచ్ జరిగింది. అది నేటికీ క్రికెట్ అభిమానులను ఆశ్చర్యపరుస్తుంది. విక్టోరియన్ బ్యాటర్‌లలో ఒకరు బంతిని బాదారు. బంతి మైదానంలోని చెట్టుపై ఇరుక్కుపోయింది. ఇంతలో బ్యాటర్లు వికెట్ల మధ్య పరుగులు చేయడం ప్రారంభించారు.
సాధారణంగా బంతి పోయినా లేదా దాన్ని తిరిగి పొందే పరిస్థితులు లేనప్పుడు అంపైర్ 'బాల్ లాస్ట్' (Ball Lost) అని ప్రకటించవచ్చు. అప్పుడు బ్యాటర్లు పరుగులు తీయడం ఆపాల్సి ఉంటుంది. అయితే ఆ సందర్భంలో అంపైర్ 'బాల్ లాస్ట్' అని ప్రకటించడానికి నిరాకరించాడు. ఎందుకంటే బాల్ స్పష్టంగా కంటికి కనిపిస్తోంది. కాబట్టి బ్యాటర్లు పరుగులు తీయడానికి అనుమతించాడు.