తెలంగాణ

telangana

దిల్లీ యంగ్ బ్యాటర్ సంచలనం- 6 బంతుల్లో 6 సిక్స్​లు - Delhi Premier League 2024

By ETV Bharat Sports Team

Published : Aug 31, 2024, 5:26 PM IST

Updated : Aug 31, 2024, 6:15 PM IST

Delhi Premier League 6 Balls 6 Sixes: 2024 దిల్లీ ప్రీమియర్ లీగ్​లో సంచలనం నమోదైంది. దిల్లీ సౌత్ జట్టుకు చెందిన యువ బ్యాటర్ 6 బంతుల్లో 6 సిక్స్​లు బాది అదరగొట్టాడు.

Delhi Premier League
Delhi Premier League (Source: Getty Images)

Delhi Premier League 6 Balls 6 Sixes:దిల్లీ ప్రీమియర్ లీగ్ 2024లో 23ఏళ్ల యువ క్రికెటర్ ప్రియాన్ష్ ఆర్య సంచలనం సృష్టించాడు. లీగ్​లో సౌత్ దిల్లీ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రియాన్ష్ శనివారం నార్త్ దిల్లీ బౌలర్లను ఊచకోత కోశాడు. మ్యాచ్​ 12వ ఓవర్లో వరుసగా ఆరు బంతులకు ఆరు సిక్స్​లు బాది ఔరా అనిపించాడు. మనన్ భరద్వాజ్ వేసిన ఈ ఓవర్లో ప్రియాన్ష్ 36 పరుగులు పిండుకున్నాడు. ఈ మ్యాచ్​లో ప్రియాన్ష్ 50 బంతుల్లోనే 120 పరుగులతో సత్తా చాటాడు. ఇందులో 10 ఫోర్లు, 10 సిక్స్​లు ఉన్నాయి.

ఇక మరోవైపు ఆయూశ్ బదోనీ కూడా బీభత్సం సృష్టించాడు. ఈ మ్యాచ్​లో బదోనీ భారీ ఇన్నింగ్స్​తో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 55 బంతుల్లోనే 165 పరుగులతో రెచ్చిపోయాడు. 300 స్ట్రైక్ రేట్​తో ఆడుతూ ఏకంగా 19 సిక్స్​లు బాదాడు. దీంతో టీ20​లో ఓ ఇన్నింగ్స్​లో అత్యధిక సిక్స్​లు బాదిన ప్లేయర్​గా రికార్డు కొట్టాడు. ఈ క్రమంలోనే విండీస్ మాజీ ప్లేయర్ క్రిస్ గేల్ (18 సిక్స్​లు) పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు.

కాగా, వీరిద్దరి దెబ్బకు దిల్లీ సౌత్ జట్టు నిర్ణీత 20ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 308 భారీ స్కోర్ చేసింది. అనంతరం భారీ లక్ష్య ఛేదనలో దిగిన నార్త్ దిల్లీ ఓవర్లన్నీ ఆడి ఎనిమిది వికెట్లు కోల్పోయి 196 పరుగులే చేయగలిగింది. దీంతో 112 పరుగుల భారీ తేడాతో సౌత్ దిల్లీ ఈ మ్యాచ్​లో నెగ్గింది.

ప్రియాన్ష్ అన్​స్టాపబుల్
అయితే యువ బ్యాటర్ ప్రియాన్ష్ ప్రస్తుత దిల్లీ ప్రీమియర్ లీగ్​లో అదరగొడుతున్నాడు. నిలడకగా ఆడుతూ సత్తా చాటుతున్నాడు. ప్రియాన్ష్ ఇప్పటికే 57 (30), 82 (51), 53 (32), 45 (26), 107*(55), 88 (42), 24 (9) స్కోర్లు నమోదు చేశాడు. దీంతో రానున్న ఐపీఎల్ మెగా వేలంలో ఫ్రాంచైజీల కళ్లు ప్రియాన్ష్​పై ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

లఖ్​నవూ నయా స్టార్- 'ఒత్తిడిలో ఆడాలా? అయితే బదోనీని పిలవాల్సిందే' - Ayush Badoni IPL

దీపక్​ హుడా, ఆయుష్​ బదోని హాఫ్​ సెంచరీ.. గుజరాత్​ లక్ష్యం ఎంతంటే?

Last Updated : Aug 31, 2024, 6:15 PM IST

ABOUT THE AUTHOR

...view details