2025 IPL Mega Auction :భారత్‌లో ఐపీఎల్‌కు ఉండే క్రేజే వేరు. తమకు నచ్చిన ఫ్రాంచైజీ మ్యాచ్ జరిగితే చాలా మంది టీవీలకు అతుక్కుపోతారు. మరికొందరైతే ఆఫీసులో సైతం ఫోన్లో మ్యాచ్‌ను వీక్షిస్తారు. అంతలా ఐపీఎల్ ఫీవర్ ఉంటుంది మరి. అయితే మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ సారి వేలంలో వికెట్ కీపర్లకు ఫుల్ డిమాండ్ ఉండనున్నట్లు తెలుస్తోంది.
పలు ఐపీఎల్ ఫ్రాంచైజీలు బ్యాటింగ్, కీపింగ్ చేయగల ప్లేయర్ల కోసం వెతుకుతున్నాయట. ఈ నేపథ్యంలో ఓ ముగ్గురు స్టార్ క్రికెటర్లపై అందరి దృష్టి మరలినట్లు తెలుస్తోంది. వీరికి భారీగా చెల్లించైనా సొంతం చేసుకోవాలని ఫ్రాంచైజీలు భావిస్తున్నాయట. ఇంతకీ వారెవరంటే?
రిషభ్ పంత్ : ది డైనమిక్ ఫోర్స్
రిషబ్ పంత్ ఇప్పటికే ఐపీఎల్లో తానేంటో నిరూపించుకున్నాడు. తన విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తాడు. వికెట్ కీపింగ్ కూడా సమర్థవంతంగా చేయగలడు. ఒంటి చేతితో మ్యాచ్‌ను ఈజీగా గెలిపించగల ప్లేయర్లలో రిషబ్ ఒకడు. అందుకే ఈ సారి పంత్ మెగా వేలంలో భారీ ధర పలకనున్నట్లు తెలుస్తోంది. చెన్నై సూపర్ కింగ్స్ ఈ ధోనీ వారసుడి కోసం వెతుకుతోంది. ఈ క్రమంలో ఆ జట్టు పంత్‌ను దక్కించుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దిల్లీ క్యాపిటల్స్‌ను పంత్ విడిచిపెడితే భారీ ధర పలకడం ఖాయమని క్రికెట్ వర్గాల మాట.