Rohit Sharma Australia Tour : ఆస్ట్రేలియాతో త్వరలో జరగున్న తొలి టెస్టులో టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆడుతాడా లేదా అన్న విషయంపై ఇంకా సస్పెన్స్ వీడలేదు. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల అతడు ఈ టూర్‌కు అందుబాటులో ఉండకపోవచ్చంటూ క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి. తాను త్వరలో రెండో బిడ్డకు తండ్రీ కానున్న నేపథ్యంలో ఫ్యామిలీతో ఉండేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు రోహిత్ శర్మ ఈ ఆస్ట్రేలియా టూర్‌కు టీమ్ఇండియాతో కలిసి వెళ్తాడని కూడా అంటున్నారు. అయితే, తొలి టెస్ట్ మ్యాచ్ మాత్రం ఆడకుండానే అతడు మళ్లీ భారత్‌కు తిరిగొస్తాడని తెలుస్తోంది. అప్పటి వరకు జట్టుతో పాటు ఉండి, అక్కడి పిచ్ పరిస్థితులపై అవగాహన తెచ్చుకొనేందుకు ప్రయత్నిస్తాడని సమాచారం. ఇప్పటికే ఈ తొలి టెస్టు కోసం అభిమన్యు ఈశ్వరన్‌ను ఓపెనర్‌గా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.
"రోహిత్ టీమ్ఇండియాతో పాటు ఆసీస్‌కు వెళ్తాడు. అయితే, తొలి టెస్టులో అతడు ఆడటంపై ఇంకా నిర్ణయం ఖరారు కాలేదు. అప్పటిలోపు ఏం జరుగుతుందో వేచి చూడాలి. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఈ టెస్ట్‌కు అందుబాటులో ఉండనంటూ ఇప్పటికే బీసీసీఐకి చెప్పుకొచ్చాడు. కివీస్‌తో తాజాగా జరిగిన చివరి టెస్టు తర్వాత కూడా విలేకర్ల సమావేశంలో రోహిత్ తన పర్యటన గురించి మాట్లాడాడు. రీసెంట్గా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అలాగే రోహిత్‌తో బీసీసీఐ తీవ్రంగా చర్చించింది. ఆసీస్ పర్యటన గురించి కూడా అందులో వీరు మాట్లాడారు" అంటూ బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఇక ఆదివారం రాత్రికి భారత జట్టు ఆస్ట్రేలియాకు బయల్దేరే అవకాశం ఉంది.
ఆసీస్ టూర్‌కు వెళ్లనున్న టీమ్ఇండియా తుది జట్టు ఇదే : అభిషేక్ శర్మ, సంజు శాంసన్, రింకూ సింగ్, తిలక్ వర్మ, జితేశ్ శర్మ, హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్, రమణదీప్ సింగ్, వరుణ్ చకరవర్తి, రవి బిష్ణోయ్, సూర్యకుమార్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, విజయ్‌కుమార్, ఆవేశ్ ఖాన్, యశ్ దయాల్.
'అది చాలా ముఖ్యం - రోహిత్ శర్మ నుంచి ఎంతో నేర్చుకున్నా'
'ఆ టెక్నిక్ ఇక్కడ పనికిరాదు - ఆ విషయంలో రోహిత్ తన వైఖరి మార్చుకోవాలి'