2025 IPL Mega Auction :2025 ఐపీఎల్ మెగా వేలంలో టీమ్ఇండియా యంగ్ బ్యాటర్ రిషభ్ పంత్ రికార్డులు బద్దలుకొట్టాడు. ఐపీఎల్ హిస్టరీలోనే అత్యధిక ధర దక్కించుకొని కొత్త రికార్డు సృష్టించాడు. మెగా వేలంలో పంత్‌ను లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ రూ.27 కోట్లకు దక్కించుకుంది. అయితే వేలంలో పంత్ కోసం ఆర్సీబీ, లఖ్‌నవూ పోటీపడ్డాయి. చివరికి లఖ్‌నవూ రూ.27 కోట్ల భారీ ధరకు దక్కంచుకుంది. ఇక అంత ధరకు రిటైన్ చేసుకోవడానికి దిల్లీ ఆసక్తి చూపించకపోవడం వల్ల పంత్ లఖ్‌నవూ సొంతం అయ్యాడు.
అంతకుముందు టైటిల్ విన్నింగ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు కూడా మంచి డిమాండ్ ఏర్పడింది. రూ.2 కోట్ల బేస్ ప్రైజ్‌తో వేలంలోకి వచ్చిన అయ్యర్ కోసం కోల్‌కతా, దిల్లీ, పంజాబ్ పోటీ పడ్డాయి. కానీ, చివరికి పంజాబ్ కింగ్స్ అయ్యర్‌ను రూ. 26.75 కోట్లకు కొనుగోలు చేసింది. అప్పటిదాకా ఇదే ఐపీఎల్లో అత్యధిక ధర. అయ్యర్ బిడ్డింగ్ తర్వాత పంత్ ఆ రికార్డును బ్రేక్ చేశాడు. మరోవైపు ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్ ఊహించని రీతిలో భారీ ధరకు అమ్ముడయ్యాడు. అతడిని తన పాత ఫ్రాంచైజీ కోల్‌కతా నైట్ రైడర్స్ తిరిగి దక్కించుకుంది. వేలంలో అయ్యర్ ఏకంగా రూ.23.75 కోట్లు పలికాడు. మరి తొలి రోజు వేలంలో ఇంకా ఎవరెవరినికి ఏయే ఫ్రాంచైజీలు కొనుగోలు చేశాయంటే?
సెట్ 1
- అర్ష్‌దీప్ సింగ్ - ₹18 కోట్లు (పంజాబ్ కింగ్స్)
- కగిసో రబడ - ₹10.75 కోట్లు (గుజరాత్ టైటాన్స్)
- శ్రేయస్ అయ్యర్ - ₹26.75 కోట్లు (పంజాబ్ కింగ్స్)
- జోస్ బట్లర్ - ₹15.75 కోట్లు (గుజరాత్ టైటాన్స్)
- మిచెల్ స్టార్క్ - ₹11.75 కోట్లు (దిల్లీ క్యాపిటల్స్)
- రిషబ్ పంత్ - ₹27 కోట్లు (లక్నో సూపర్ జెయింట్స్)
సెట్ 2
- మహ్మద్ షమీ - ₹10 కోట్లు (సన్‌రైజర్స్ హైదరాబాద్)
- డేవిడ్ మిల్లర్ - ₹7.5 కోట్లు (లఖ్‌నవూ సూపర్ జెయింట్స్)
- యుజ్వేంద్ర చాహల్ - ₹18 కోట్లు (పంజాబ్ కింగ్స్)
- మహ్మద్ సిరాజ్ - ₹12.25 కోట్లు (గుజరాత్ టైటాన్స్)
- లియామ్ లివింగ్‌స్టోన్ - ₹8.75 కోట్లు (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు)
- KL రాహుల్ - ₹14 కోట్లు (దిల్లీ క్యాపిటల్స్)
సెట్ 3
- హ్యారీ బ్రూక్ - ₹6.25 కోట్లు (దిల్లీ )
- ఐడెన్ మార్క్రామ్ - ₹2 కోట్లు (లఖ్‌నవూ సూపర్ జెయింట్స్)
- డెవాన్ కాన్వే - ₹6.25 కోట్లు (చెన్నై సూపర్ కింగ్స్)
- రాహుల్ త్రిపాఠి - ₹3.4 (చెన్నై సూపర్ కింగ్స్)
- జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్ - ₹9 కోట్లు (దిల్లీ క్యాపిటల్స్)
ఆల్- రౌండర్ల సెట్ 1
- హర్షల్ పటేల్ - ₹9 కోట్లు (సన్‌రైజర్స్ హైదరాబాద్)
- రచిన్ రవీంద్ర - ₹4 కోట్లు (చెన్నై సూపర్ కింగ్స్)
- రవిచంద్రన్ అశ్విన్ - ₹9.75 కోట్లు (చెన్నై సూపర్ కింగ్స్)
- వెంకటేష్ అయ్యర్ - ₹23.75 కోట్లు (కోల్‌కతా నైట్ రైడర్స్)
- మార్కస్ స్టోయినిస్ - ₹11 కోట్లు (పంజాబ్ కింగ్స్)
- మిచెల్ మార్ష్ - ₹3.4 కోట్లు (లఖ్‌నవూ సూపర్ జెయింట్స్)
- గ్లెన్ మాక్స్‌వెల్ - ₹4.2 కోట్లు (పంజాబ్ కింగ్స్)