2024 IPL Orange Cap:2024 ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ యంగ్ బ్యాటర్ రియాన్ పరాగ్ అదరగొడుతున్నాడు. కొంతకాలంగా సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు గురైన ఈ 24ఏళ్ల ప్లేయర్ ప్రస్తుత టోర్నీలో బ్యాట్‌తోనే సమాధానం చెబుతున్నాడు. ఈ క్రమంలో రాజస్థాన్ రాయల్స్ విజయాల్లో రియాన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. అతడు ఇప్పటి వరకూ ఆడిన మూడు మ్యాచ్‌ల్లో వరుసగా 43, 84, 54 పరుగులు నమోదు చేసి, ఆరెంజ్ క్యాప్ రేస్‌లోకి దూసుకొచ్చాడు.
ఇప్పటికే ప్రస్తుత సీజన్లో 181 పరుగులు బాదిన రియాన్ ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు. అయితే రాయల్ ఛాలెంజర్స్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా అత్యధిక పరుగులు బాదిన జాబితాలో రియాన్‌తో సమానంగా (181 పరుగులు) టాప్‌లోనే ఉన్నాడు. కానీ, క్యాప్ మాత్రం రియాన్కే దక్కింది. ఎందుకో తెలుసా?
అయితే ఐపీఎల్ నిబంధనల ప్రకారం, టోర్నమెంట్లో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ బ్యాటర్లు అన్నే పరుగులు (Same Runs) చేస్తే, స్ట్రైక్ రేట్ ఆధారంగా తొలి స్థానానికి ప్రియారిటీ ఇస్తారు. ఈ విధంగానే అత్యధిక స్ట్రైక్ రేట్‌తో పరుగులు సాధించిన బ్యాటర్లకే ఆరెంజ్ క్యాప్ ఇస్తారు. ఈ నేపథ్యంలో విరాట్, రియాన్ పరాగ్ ఇద్దరూ 181 పరుగులు బాదడం వల్ల స్ట్రైక్ రేట్ ఆధారంగా క్యాప్ రియాన్ దక్కించుకున్నాడు. కాగా, రియాన్ 160.18 స్ట్రైక్ రేట్ నమోదు చేయగా, విరాట్ 141.41 స్ట్రైక్ రేట్‌తో రెండో స్థానంలో ఉన్నాడు. ఇక మంగళవారం (ఏప్రిల్ 2) ఆర్సీబీ, లఖ్‌నవూతో మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లో క్యాప్ చేతులు మారే ఛాన్స్ ఉంది.