ETV Bharat / sports

'నేనైతే కరెక్ట్​గానే ఉన్నా - జైషా అలా చేస్తారని అశిస్తున్నా!' - పీసీబీ చీఫ్​ - PAK VS IND CHAMPIONS TROPHY 2025

ఛాంపియన్స్ ట్రోఫీ తమ దేశంలో నిర్వహించాలని పాక్ పట్టు - పీసీబీ ఛైర్మన్ కీలక వ్యాఖ్యలు

Jay shah  Mohsin Naqvi
Jay shah Mohsin Naqvi (source IANS and AFP)
author img

By ETV Bharat Sports Team

Published : Nov 28, 2024, 11:47 AM IST

Champions Trophy PCB Chairman Mohsin Naqvi : ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై పాకిస్థాన్ తగ్గట్లేదు. ఎలాగైనా తమ దేశంలో ఐసీసీ టోర్నీని నిర్వహించి తీరాలని పట్టుపడుతోంది. ఈ క్రమంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యం ఇవ్వడంపై పీసీబీ స్పష్టమైన వైఖరితో ఉందని వ్యాఖ్యానించారు. ఈ టోర్నీ కోసం భారత్ తమ దేశం రాకపోతే, భవిష్యత్తులో పాకిస్థాన్ కూడా భారత్​కు వెళ్లదని మరోసారి అన్నారు.

'భారత్ అలా చేయడం కరెక్ట్ కాదు' - "పాకిస్థాన్​లో ఐసీసీ టోర్నమెంట్ ఆడేందుకు భారత్ రాకపోవడం ఆమోదయోగ్యం కాదు. 2023 వన్డే ప్రపంచ్ కప్​లో ఆడడానికి పాక్ భారత్​కు వెళ్లింది. ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై పీసీబీ వైఖరి చాలా స్పష్టంగా ఉంది. పాకిస్థాన్ క్రికెట్​కు ఏది అవసరమో అదే చేస్తున్నా. నిరంతరం ఐసీసీ ఛైర్మన్​తో టచ్​లో ఉంటున్నా. ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్యం కోసం మాట్లాడుతున్నాను. ఐసీసీ టోర్నీ కోసం పాక్​కు భారత్ రాకపోతే, తర్వాత మా జట్టు కూడా భారత్ వెళ్లదు. ఈ విషయాన్ని ఐసీసీకి ఇప్పటికే స్పష్టంగా చెప్పాం." అని పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ విలేకరుల సమావేశంలో వ్యాఖ్యానించారు.

'పాక్ ప్రభుత్వానికి తెలియజేస్తాం' - ఐసీసీ సమావేశంలో తీసుకునే ఏ నిర్ణయమైనా తుది ఆమోదం కోసం పీసీబీ పాకిస్థాన్ ప్రభుత్వానికి తెలియజేస్తుందని నఖ్వీ తెలిపారు. "మేము ఏమి చేసినా అది పాకిస్థాన్ క్రికెట్ ప్రయోజనాలు కోసమే అని గతంలో చెప్పాను. అదే విషయాన్ని మళ్లీ పునరావృతం చేస్తున్నాను. బీసీసీఐ కార్యదర్శిగా ఉన్న జైషా డిసెంబరు 1న ఐసీసీ ఛైర్మన్​గా బాధ్యతలు స్వీకరిస్తారు. అప్పుడు ఆయన ఐసీసీ ప్రయోజనాల కోసం పనిచేస్తారని అనుకుంటున్నాను. ఎవరైనా అలాంటి పదవిని స్వీకరించినప్పుడు సంస్థ ప్రయోజనాలను కాపాడేందుకు ప్రయత్నిస్తారు." అని నఖ్వీ అన్నారు.

మరోవైపు, పాకిస్థాన్​లో నెలకొన్న రాజకీయ అనిశ్చిత పరిస్థితుల వల్ల ఛాంపియన్స్ ట్రోఫీని బయట నిర్వహించాలని ఐసీసీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్​ను జైలు నుంచి విడుదల చేయాలని నిరసనలు వంటి కారణాల వల్ల ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుందట. ఛాంపియన్స్‌ ట్రోఫీకి ఆతిథ్యమిచ్చేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ పరిణామాల్నీ పాకిస్థాన్​కు మరింత ఇబ్బందికరంగా మారుతున్నాయి.

ఛాంపియన్స్​ ట్రోఫీ ఆతిథ్యం కోల్పోనున్న పీసీబీ - బీసీసీఐ మాత్రం కారణం కాదు!

అప్పుడు సచిన్​, కాంబ్లీ - ఇప్పుడు యశస్వి, పృథ్వీ షా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.